ఎందుకు ఉక్రోషంతో ఊగిపోతున్నారు ?

అవును అసెంబ్లీ ఈరోజు వైసిపి వాళ్ళు రెచ్చిపోతున్నారంటే అంతా చంద్రబాబునాయుడు స్వయం కృతమనే అనుకోవాలి. ప్రారంభమైన అసెబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎంఎల్ఏలు ఏ అంశమైనా కానీండి చంద్రబాబు అండ్ కోను వాయించి వదిలేస్తున్నారు. దాంతో ఏం చెప్పాలో అర్ధంకాక చంద్రబాబు నోరు లేవటం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, రైతుల రుణమాఫీ, విత్తనాల పంపిణీ, సున్నవడ్డీకే రైతులకు రుణాల మంజురు…ఇలా అంశం ఏదైనా కానీండి అధికారంలో ఉన్నపుడు చేసిన తప్పులే ఇపుడు చంద్రబాబును వెంటాడుతున్నాయి. అధికారం అందులో ఉన్నపుడు చంద్రబాబు చేసిన తప్పులను ఆధారాలుగా చేసుకుని జగన్ అండ్ కో ఆయుధాలుగా ఎక్కుపెడుతున్నారు. దాంతో ఏం సమాధానాలు చెప్పాలో దిక్కు తోచక తలొంచుకుంటున్నారు.

నిజానికి తాను అధికారంలో ఉండగా వైసిపిని ఓ పార్టీగా జగన్ ను ప్రధాన ప్రతిపక్షనేతగా గుర్తించటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. అందుకనే జగన్ అండ్ కో అసెంబ్లీకి హాజరైనంత కాలం ఏమి మాట్లాడినా వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. పైగా నోటికొచ్చినట్లు మంత్రులు, ఎంఎల్ఏలు జగన్ ను తిట్టి అవమానిస్తుంటే చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకోవటం అందరూ చూసిందే.

కాలం ఎల్లకాలం ఒకలాగుండదు. అందుకే అప్పటి ప్రతిపక్షం ఇపుడు అధికారంలోకి వస్తే అప్పటి సభాపతి చంద్రబాబు ఇపుడు ప్రతిపక్ష నేత స్ధానంలో కూర్చున్నారు. పైగా అధికారంలో ఉన్నంత కాలం అనేక తప్పులు చేశారు. తానిచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కారు. అదే ఇపుడు జగన్ అండ్ కో కు ఆయుధాలయ్యాయి. అందుకే మాట్లాడటానికి ఏమీ లేక తనను తాను డిఫెండ్ చేసుకోవటంలో భాగంగానే చంద్రబాబు ఉక్రోషంతో ఊగిపోతున్నారు.