సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ ట్వీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ”ఏపీ సీఎం జగన్ గారికి ధన్యవాదాలు. మా సమస్యలను విని, వాటి పరిష్కారం దిశగా సినిమా టికెట్ రేట్లని సవరించి కొత్త జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు. భవిఫ్యత్‌లో ప్రభుత్వం నుండి టాలీవుడ్‌కు మంచి సపోర్ట్, అండర్ స్టాండింగ్ ఉండాలని కోరుకుంటున్నాను” అని జగన్‌తో పాటు మంత్రి నానికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

 

సినిమా టికెట్ రేట్లను ఓ మోస్తరుగా పెంచుతూ కొత్త జీవోని విడుదల చేసిన విషయవం తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఏపీ ప్రభుత్వానికి, ఏపీ సీఎం జగన్‌కి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలుపారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.