ముఖ్యమంత్రి కెసిఆర్ కు మళ్లీ వాస్తు భయం?

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి మళ్లీ వాస్తు భయం పట్టుకుంది. అందునా ఎన్నికలు సమీపిస్తున్నపుడు…అందుకే ఎందుకైనా మందచిదని ఆయకోసం ప్రత్యేకంగా , ప్రత్యేక శ్రద్ధతో, ప్రత్యేక వసతులతో నిర్మించిన ఒక కార్యాలయంలో కాలు పెట్టడమే లేదు. నిజానికి ఆ కార్యాలయం నిర్మించాలన్నది కూడ ఆయన ఆలోచనే. ఆయన ఆలోచన ప్రకారమే నిర్మాణం జరిగింది. అయితే, ఆ తర్వాత ఎవరో, కొత్త గా నిర్మించిన కార్యాలయం వాస్తు దోషాలతో  ఉందని, అందువల్ల  తీరా ఎన్నికలు సమీపిస్తున్నపుడు వాస్తు దోషం ఉన్న కార్యాలయంలో కాలుమోపడం మంచిది కాదని సలహా ఇచ్చారట. అంతే, ఆయన ఆ భవనం వైపు కన్నెత్తి చూడటం లేదు. దాని పక్కనే ఏన్నోకార్యక్రమాలలో పాల్గొన్నా, ఆ ఆఫీసులోకి మాత్రం రావడం లేదు.

ఇంతకీ ఆఫీసేమిటో  తెలుసా?   

అది గజ్వేల్ పట్టణంలో ఆయన కోసం ఆర్ అండ్ బి  శాఖ నిర్మించి ఇచ్చిన నియోజకవర్గ కార్యాలయం. 

రాష్ట్రంలో శాసన సభ్యులందరికి  నియోజకవర్గంలో కార్పొరేట్ స్టయిల్ లో ఒక కార్యాలయం ఉండాలని ముఖ్యమంత్రి స్వయంగా తాను అధికారంలోకి వచ్చిన కొత్త లో ప్రకటించారు. ఎమ్మెల్యేలందరికి ఒక క్యాంపాఫీసు ఉండాలని 119 క్యాంపాఫీసులు అద్భు తంగా నిర్మించాలని కెసిఆరే ప్లాన్ చేశారు. నిధులు విడుదల చేశారు. ఆ కార్యక్రమం అమలు చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే  కార్యాలయం. ఎమ్మేల్యే స్వయాన ముఖ్యమంత్రి కావడంతో  ఈ కార్యాలయానికి వివిఐపి హోదా వచ్చింది.

దాదాపు అయిదుకోట్ల రుపాయలు ఖర్చుచేసి ఆర్ అండ్ బి వారు మరొక ముఖ్యమంత్రి కార్యాలయం విలాసవంతంగా తయారుచేశారు.

ఒక ఎకరాస్థలంలో 4000 చదరుపు అడుగలు విస్తీర్ణంలో ముఖ్యమంత్రి పని చేసేందుకు అసవరమయిన అన్ని అధునాతన వసతులతో, హంగులతో ఈ కార్యాలయం రూపొందింది.  అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినపుడు ముఖ్యమంత్రి ఈ క్యాంపాఫీసులో బస చే్స్తారని భావించిన దీనికి తగ్గట్టు బుల్లెట్ ప్రూఫింగ్ కూడా చేశారు. ఇపుడు ఈ బంగళా రెడీ అయింది.

చడీ చప్పుడు లేకుండా ఈ మార్చిలోనే గృహ ప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగాని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యలుగాని రాలేదు.  అసలు విషయమేమంటే, వాస్తుదోషం వల్ల ఈ భవనం ముఖ్యమంత్రి కెెఆసిర్ కు అనుకూలంగా  లేదని. అందుకే హైస్ వామింగ్ సెరిమినీ కి నీటిపారుదల  శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపి  కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. వారెలా వెళ్లారు, వాళ్లకి వాస్తు దోష ప్రభావం ఉండదా? ఇది వేరే ప్రశ్న.

గత ఏడాది అక్టోబర్ లో ఈ భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. నిర్మాణం మొదలయింది. దీనికి వాస్తు సలహా ఇచ్చిందెవరో కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తు కన్సల్టెంట్ గా ఉన్న సుద్ధాల అశోక్ తేజ.  మరి ఇపుడు వాస్తు దోషమేమిటనేది అధికారులను వేధిస్తున్న ప్రశ్న. 

వాస్తు దోషాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిజానికి గత వారంలో ఆయన హరిత హారం కార్యక్రమంలో పాల్గొనేందుకు గజ్వేల్ నియోజకవర్గం వెళ్లారు. అయినా సరే, తన కోసమే నిర్మించిన కార్యాలయంలో మాత్రం కాలుమోపలేదు. ఈ క్యాంపాఫీసు ఉద్దశం  నియోజకవర్గ ప్రజలతో, లీడర్లతో, అధికారులతో సంప్రదింపులు జరిపడం. ప్రతివారం ఆయన పక్కనే ఉన్న తన ఫామ్ హౌస్ కు వస్తున్నారు.నియోజవర్గ సమావేశాలను అక్కడినుంచే నిర్వహిస్తున్నారు తప్ప  నియోజకవర్గం లో కట్టిన ఈ కొత్త క్యాంపాఫీసుకు మాత్రం రావడం లేదు.

ఇపుడు వాస్తుదోషాన్ని సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.  ముఖ్యమంత్రి కెసిఆర్ కు వాస్తు పట్టింపులెక్కువ. వాస్తుదోషం వల్లే ఆయన సెక్రెటేరియట్ వెళ్లడం మానేశారు. దాన్ని కూల్చి తనకు అనుకూలంగా వాస్తు ప్రకారం ఒక కొత్త సెక్రెటేరియట్ నిర్మించాలని చూస్తున్నారు. ఇదే విధంగా బేగంపేట్ క్యాంపాఫీసు వాస్తు కూడా ఆయన నచ్చలేదు. దాన్న వదిలించుకునేందుకు ఆయన దేశంలోనే అత్యంత ఖరీదయిన, పెద్దదయిన ముఖ్యమంత్రికార్యాలయం  ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. 

అయినా ముఖ్యమంత్రికి ఈ క్యాంపాఫీసులో కి వచ్చే  తీరుబడే లేకుండా పోయింది.