అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఘోరమిది

( మా ప్రత్యేక ప్రతినిధి)

అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఒక బాధాకరమయిన విధానాన్ని కొంతమంది రైతులు ఈ రోజు జనసేన నేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ‘ ల్యాండ్ పూలింగ్ ’కు భూములిచ్చి ‘త్యాగం’ చేయని రైతులను  అధికారులు రకరకాలుగా సతాయిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. త్యాగం చేయని రైతులు తమ సొంతపొలాల్లో పరాయివాళ్లయిపోయారు. తమ పొలాల్లో కి వెళ్లాలంటే అధికారులకు విదేశీయుల్లాగా వారు ‘పాస్ పోర్ట్’ చూపాల్సివస్తున్నది. ఆ పాస్ ఫోర్టో ఏమిటో తెలుసా, ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్  లేకపోతే, సొంతపొలాల్లోకి కూడా రైతులను వెళ్లనీయడం లేదని వారు పవన్ చెప్పారు.

 

ఈ రోజు పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి పర్యటించారు.

 

గుంటూరు జిల్లా ఉండవల్లి లో రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘సమావేశమయ్యారు. ఇలాంటి సమావేశాలలొ ఇది రెండోసారి . గతంలో రాజధాని ప్రాంత రైతుల భూములను లాండ్ పూలింగ్  నుంచి మినహాయించాలని ఆయన ఒక ధఫా సమావేశమయ్యారు. అపుడాయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి   మిత్రుడు. ఆ సమావేశం తర్వాత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల భూములను రైతుల కు వ్యతిరేకంగా  సేకరించమని  హామీ ఇచ్చారు.పవన్ వెళ్లిపోయారు.

ఇపుడా చంద్రబ ాబు నాయుడి మీద యుద్ధం ప్రకటించాక వచ్చి రైతులతో వారి పొలాల్లోనే సమావేశమయ్యారు. ఉండవల్లి లోని పంటపొలాలను స్వయంగా పరిశీలించారు.

ప్రభుత్వం మా పోలలాను బీడు భూములని ఎటువంటి పంటలు పండటంలేదని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నదని  అక్కడి మహిళలు  పవన్ కళ్యాణ్ తో చెప్పి వాపోయారు.

ఉండవల్లి లోని వ్యవసాయ భూముల లో వారు పండించిన తోటలలో రైతులు తో కలసి కలియతిరిగారు పవన్.

చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో మనల్ని మోసం చేశారని వారు పవన్ కళ్యాణ్ కి విన్నవించుకున్నరు.

తమ భూములలోకి మేము వెళ్లాలన్న అధార్ కార్డు చూపించి ప్రభుత్వం అనుమతి కావాలంటున్నారని రైతులు పవన్ దృష్టికి తెచ్చారు

‘ మీరు చెప్పారని నాడు తెలుగుదేశం పార్టీ కి చంద్రబాబు నాయుడు కి ఓటు వేశాం. గతంలో మీరు ఇచ్చిన హమీ మేరకు మాకు అండగా నిలబడి మా భూములు ను కాపాడే భాద్యత మీదే,’ అని పవన్ కళ్యాణ్ కి తెగేసిన చెప్పిన రైతులు.

ల్యాండ్ పూలింగ్ నుండి ఉండవల్లి గ్రామాన్ని మినహాయించేలాచూడాలని రైతులు పవన్ కళ్యాణ్ కి తెలిపారు.