రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో పవన్ పై జనసైనికులకు, వీరమహిళలకు, ఆయన సినిమాల అభిమానులకు, కాపు సామాజికవర్గంలోని ప్రజానికానికి, సామాన్య ప్రజలకూ ఉన్న అభిప్రాయం వేరు! గత నాలుగైదు సంవత్సరాలుగా ఆయనపై మారుతున్న, మారిన అభిప్రాయం పూర్తిగా వేరనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది. మనల్ని ఎవడ్రా ఆపేది అని చెప్పే పవన్.. తన గెలుపు బాధ్యత తమ చేతుల్లో పెడుతున్నానంటూ టీడీపీ అభ్యర్థిని వేడుకున్న విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశం!
పాతికో పరకో టిక్కెట్లు తీసుకుని జనసైనికుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టను అని చెప్పిన వ్యక్తే… అంతకంటే ఎక్కువ ఎందుకు, ఎన్నికల సమయంలో 10 మందికి భోజనాలు కూడా పెట్టలేము.. నాకు సలహాలిచ్చే వాళ్లు వద్దు.. చెప్పిన ప్రతీ దానికీ తలాడించేవాళ్లే నా వాళ్లు అన్నట్లుగా ఆయన బలంగా స్పందించారు. చెప్పే మాటలకూ చేసే పనులకూ ఏమాత్రం పొంతన లేకుండా.. పవన్ చెప్పాడంటే చేయడంతే అనే స్థాయి కామెంట్ ను సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం పిఠాపురం పర్యటనలో బిజీగా గడుపుతున్న పవన్ కల్యాణ్ పై ఆ పార్టీ మహిళా మాజీ కార్యకర్త, మాజీ వీర మహిళ ఆన్ లైన్ వేదికగా స్పందించిన విధానం, విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. పైగా… “సేవ్ పిఠాపురం ఫ్రం పవన్ కల్యాణ్” అని మొదలు పెట్టడంతో ఈ ట్వీట్ పై మరింత ఆసక్తి నెలకొంది. దీంతో… పవన్ ని దగ్గరనుంచి చూసి, ఆయన ప్రవర్తనపై ఒక అవగాహనకు వచ్చిన వారి రియాక్షన్ ఈ రేంజ్ లో ఉంటుందా అని అంటున్నారు నెటిజన్లు!
ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ విషయనికొస్తే… “తన పార్టీని నడపలేక వేరొక పార్టీకి రెంట్ కి ఇచ్చి, తన గెలుపు వేరొక పార్టీ వాళ్ళ చేతిలో పెట్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమి చేసేద్దామని బయలుదేరారో ఈ సారు?? వచ్చే ఎన్నికలకు బూత్ స్థాయి కమిటీలు లేని పార్టీ వాళ్ళు ప్రతీ గ్రామంలో పెన్షన్ అందేలా చేస్తాము అని అనడం ఏదైతే ఉందో.. నభూతో నభవిష్యతి! గాడిద పని గాడిద చేయాలి.. గుర్రం పని గుర్రమే చేయాలి అనే సామెత గుర్తొస్తుంది”!
ఇదే సమయంలో… సేవ్ పిఠాపురం ఫ్రం పవన్ కల్యాణ్ అనడంతోపాటు.. దశాబ్దంలో అతిపెద్ద జోక్ పవన్ కల్యాణ్ అంటూ ఆమె చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పైగా… తన మాటే కాపులకు శిరోధార్యం అనే భ్రమలో పవన్ కల్యాణ్ ఉన్నారన్నే కామెంట్స్ కి తాజాగా ఈ మాజీ వీరమహిళ పెట్టిన ట్వీట్ చెంప పెట్టు లాంటిదని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో… పవన్ నుంచి పిఠాపురాన్ని రక్షించుకోవాలంటూ ఆమె క్యాంపెయినింగ్ మొదలుపెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది.
Save #Pithapuram from #PawanKalyan
"Joke of the decade @PawanKalyan "
తన పార్టీని నడపలేక వేరొక పార్టీకి రెంట్ కి ఇచ్చి, తన గెలుపు వేరొక పార్టీ వాళ్ళ చేతిలో పెట్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమి చేసేద్దామని బయలుదేరారో ఈ సారు??
వచ్చే ఎన్నికలకు బూత్ స్థాయి కమిటీలు లేని పార్టీ… https://t.co/YF1rYMmXXH
— Jaya Kalyani Akula (@JayaKalyani_AJ) April 2, 2024