జగన్ సభ.. రోడ్లు బ్లాక్, ఆటోలో గర్భిణీ స్త్రీ.. టెన్షన్ (వీడియో)

విజయనగరం జిల్లాలో జరుగుతున్న జగన్ పాదయాత్ర బహిరంగ సభలో ఓ అరుదైన సంఘటన జరిగింది. జగన్ సభలో ప్రసంగిస్తుండగా ఓ నిండు గర్భిణి ప్రసవానికి వెళుతుంది. రోడ్డం అంతా జనంతో నిండి ఉండటంతో ఆటో వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. నేతల ద్వారా విషయం తెలుసుకున్న జగన్.. అన్నా ఆటోలో నిండు గర్భిణి ఉంది దయచేసి దారివ్వండి అన్నా అంటూ అందరిని కోరాడు. దీంతో  ఉన్న జనమంతా పక్కకు జరిగి ఆటోకు రోడ్డిచ్చారు. 108 సమయానికి రాక నిండు గర్భిణి నరకయాతన పడుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఆ వీడియో కింద ఉంది చూడండి.