చంద్రబాబును రాయలేని భాషలో తిట్టిన కేసీఆర్

ఏపీ సీఎం చంద్రబాబు పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ప్రగతి భవన్ లో మీడియాతో శనివారం సాయంత్రం మాట్లాడిన ఆయన ఏమన్నారో ఆయన మాటల్లో… 

“చంద్రబాబు నాయుడు తల తొక లేకుండా మాట్లాడుతున్నాడు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అవుతుంది. ఏ సీఎం అయినా, ఏ నాయకుడైనా వారి ప్రజలకు ఇబ్బంది లేకుండా హైకోర్టు అక్కడికి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మేమే అన్యాయంగా హైకోర్టును తరలించామని మాట్లాడుతుర్రు.  ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు అనుకుంటుండు. అర్ధం పర్ధం లేకుండా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. డిసెంబర్ చివరి నాటికి హైకోర్టును ఏపికి తీసుకుపోతామని అఫిడవిట్ ఇచ్చింది ఏపి ప్రభుత్వమే కదా. తాము కూడా రెండు హైకోర్టులు వేరు వేరుగా నిర్వహించాలని అఫిడవిట్ ఇచ్చాం. కాని ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతుండు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు లజ్జ ఉండాలే మాట్లాడుతందుకు.  ఏపి ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ పరిగణలోకి తీసుకునే సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 

చంద్రబాబు అంత డర్టీయెస్ట్ పొలిటిషియన్ ను చూడలేదు. నేను ఏ నాయకుడిని కలిస్తే చంద్రబాబుకు ఎందుకయ్యా మంట. చంద్రబాబు నువ్వు నవీన్ పట్నాయక్ ను ఎందుకు కలిశావు.ఎల్లయ్య పుల్లయ్యను నువ్వు కలిస్తే తప్పు లేదు కానీ నేను కలిస్తే తప్పా. సిగ్గుండాలే చంద్రబాబు. అసలు నీకు తలకాయ ఉందా. మెదడు ఉండి మాట్లాడుతున్నవా లేకుండా మాట్లాడుతన్నవా. నాలుగేళ్లుగా మోడీ సంక నాకినవు. ఆయన ఒళ్లో ఎక్కి కూర్చున్నావు. ఇప్పుడేమో రాహుల్ పక్కకు చేరినవు.

ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోదీ ఏపీ వస్తున్నారని ప్రశ్నించావు మరీ నీదే ముఖం బాబు.  నీ స్వార్దం కోసం రాజకీయాలు చేస్తున్నావు. వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు ని మించిన వారు  లేరు. అసలు ఇలాంటి నీచ నాయకుడిని ఏపీ ప్రజలు ఎలా భరిస్తున్నారో అర్ధం కావడం లేదు. హరికృష్ణ చావును కూడా రాజకీయంగా వాడుకున్నాడు. అమాయకురాలైన ఆయన బిడ్డను తీసుకొచ్చి ఓడించాడు. ఇప్పుడా అమ్మాయికి ఏమైనా చేస్తాడా ఏం చేయడు. ఆయన స్వార్ధం అయిపోయిందిగా ఇక మూసుకొని కూర్చుంటడు. చంద్రబాబు లీడర్ లా కాకుండా మేనేజర్ లా చేస్తుండు. ఆయనవి అన్ని మేనేజింగ్ రాజకీయాలే.

చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రాజకీయాలు చేస్తాడట. అసలు ఆయనకు ఇంగ్లీషు సరిగా మాట్లాడడం వచ్చా. జాతీయ రాజకీయాలు అంటే అంత ఈజీనా. ఏదో నలుగురు నాయకులను కలవగానే అయిపోయిందా. మామ పెట్టిన పార్టీని ఏజంట్ లా నడుపుతున్నవాడు చంద్రబాబు. కానీ నేను ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన. పార్టీని నడిపి ప్రజలల్లో నమ్మకం పెంచుకున్నాం. ఇక్కడ ఉన్న రెండు మూడు పేపర్లు బాబుకు డబ్బాచారాలు కొడుతున్నాయి. ఆయనకు అంత సీన్ లేదు.

హైదరాబాద్  కు ఐటి తెచ్చింది రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి. వాళ్ళ వల్లె నేడు ఐటి నిలబడింది. ఐటికి బాబు పీకిందేం లేదు. అసలు చంద్రబాబు చాప్టర్ ఇక క్లోజ్.  నేను విశాఖకు పోతే అభిమానంతో వేల మంది వచ్చిర్రు. వారిని వైసిపి, వెలమ వాళ్లు అని ప్రచారం చేయించాడు. చంద్రబాబు నేను జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. నీకు చేతనైతే చేయి లేకపోతే కూర్చో కానీ అబద్దాలతో డంబాచారాలు కొట్టుకోకు” అని కేసీఆర్ అన్నారు.