జగన్ కోర్టు అప్పీళ్లు తెలుగుదేశంకు కలిసివస్తున్నాయా?

జగన్ తన ఆస్తుల కేసులో పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. దాని తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఒక్కసారి తృటిలో అధికారం చేజారింది, మరోసారి రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో యాభై శాతం ఓట్లు ఎనభై శాతం సీట్లు గెలిచారు. ఈ ఫలితాలు చూస్తే ఓటు వేసే ప్రజలు జగన్ మీద వున్నా అవినీతి కేసులు గాని అతను అనుభవించిన జైలు జీవితం గురుంచి ఏమనుకుంటున్నారో అర్ధమవుతుంది.

అయితే వచ్చిన చిక్కల్లా ఈ కేసులు ఎప్పటికి తేలవు. జగన్ లాంటి ఒక సీరియస్ రాజకీయ నాయకుడికి ఇవి జీవిత కాలపు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. ఎన్నోసార్లు నా కేసులన్నీ కలిపి విచారించండి అని కోర్టును కోరితే, కోర్టు ఈ విన్నపాన్ని తోసిపుచ్చింది. సరే ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా నా విధులు నిర్వర్తిస్తున్నాను, ప్రతి శుక్రవారం కోర్టు హాజరకు మినహాయింపు ఇవ్వండి అంటే కుదరదు అంటున్నారు. ఈ దేశంలో కోర్టులకు చాలా గౌరవం వుంది అలాగే చాలా విషయాల్లో రాజకీయ జోక్యం ఉందేమోనన్న ఒక అభిప్రాయం కల్పించే తీర్పులు వున్నాయి.

ఇలా వున్నా ఆ వ్యవస్థతో జగన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తనకు అనుకూలమైన సమయం కోసం వేచివుండాలి. అప్పీల్ని కోర్టు ఏమాత్రం అంగీకరిస్తుందో చెప్పగలిగిన లాయర్లు తన టీంలో పెట్టుకోవాలి. సెషన్స్ కోర్టులో బెయిల్ అప్పీలుకి చేసేవాళ్ళు కూడా రేపు ఏ జడ్జి వుంటారో ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడో చూసి తమ పిటిషన్ వేసుకుంటున్నారు. అలాంటిది ఇలా వారం వారం కోర్టుకు మినహాయింపు కు అప్పీల్ చెయ్యడం అది కోర్టు కొట్టేయడం చూస్తూవున్నాము. ఈ తతంగాన్నంతా కొన్ని ఛానళ్ళు పేపర్లు రేపు జగన్ కి ఏమవుతుందో అని ఒక పెద్ద నెగటివ్ పబ్లిసిటి. ఇది వాడుకొని తెలుగుదేశం అనుకూల మీడియాలో చర్చలు. ఇది తెలుగుదేశంకు ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది.

ఆరు రోజుల్లో సాక్షుల్ని ప్రభావితం చేయలేని వ్యక్తి శుక్రవారం మాత్రమే చేస్తాడంటే మనకి తెలియని లాజిక్ ఏదో కోర్టుకి తెలిసుండాలి.