Y.S.Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణంలో భాగంగా పెద్ద ఎత్తున విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కుంభకోణంలో కొంతమంది అరెస్ట్ కావడంతో త్వరలోనే పెద్ద తిమింగలం కూడా అరెస్టు కాబోతుందంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు వరుసగా మాట్లాడటంతో జగన్ అరెస్ట్ గురించే మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్ లో అరెస్టు కావడం తప్పదని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ విషయంపై ఇటీవల హోమ్ మంత్రి స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకోపోతుంది అంటూ సమాధానం ఇచ్చారు అయితే మంత్రి లోకేష్ సైతం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా అంటే లోకేష్ మరికాస్త సమయం పడుతుందనే సమాధానం చెప్పుకోవచ్చారు. గత ప్రభుత్వ హయామంలో జరిగిన అవినీతి గురించి అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారని అయితే పక్కా ఆధారాలతోనే ఈ అవినీతిని బయట పెట్టబోతున్నారని జగన్ తెలియ చేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు అవసరమయ్యే ఆధారాలన్నింటినీ కూడా అధికారులు సేకరిస్తున్నారని లోకేష్ తెలిపారు.
పెద్దిరెడ్డి ఖాతాకు అదాన్ డిస్టిలరీ ఖాతాల నుంచి ముడుపుల సొమ్ము ముట్టిందని భోగట్టా. జగన్ దగ్గరికే బంగారం వెళ్లిందని ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందని తెలుస్తోంది. ఇలా ఈ కుంభకోణాల గురించి పక్క ఆధారాలు లభ్యమైతే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందికర పరిస్థితులలోకి నెట్టివేయచ్చనే దిశగానే కూటమి పావులు కదుపుతోందని తెలుస్తోంది. నిజంగానే కూటమి సర్కార్ ఇలాంటి చర్యలు చేపడితే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవనే తెలుస్తుంది. మరి ఈ ఇబ్బందుల నుంచి జగన్ ఎలా బయటపడతారు అనేది తెలియాల్సి ఉంది.
