Y.S.Jagan: కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వైయస్సార్సీపీ … రాహుల్ గాంధీతో చేతులు కలపనున్నారా?

Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే తన రాజకీయాలను ప్రారంభించారు తన తండ్రి కాంగ్రెస్ నాయకుడుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న సమయంలోనే ఈయన కూడా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు అయితే తన తండ్రి మరణాంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొన్ని ఆంక్షలు కారణంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఇలా జగన్ ఈ పార్టీని స్థాపించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది.

అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కావడం అలాగే కూటమి పార్టీలు బలంగా ఉండడంతో వైసిపి ఈ కూటమితో ఒంటరి పోరాటం చేస్తుంది. ఈ కూటమి ఇలాగే కొనసాగితే జగన్ ఎన్నికలలో పోటీ చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదని అందుకే ఇండియా కూటమితో కలిసిపోతే బాగుంటుందని గత కొంతకాలంగా వార్తలు వినపడుతున్నాయి. ఇక ప్రస్తుతం జగన్ మాత్రం ఏ పార్టీలతోనూ కలవకుండా ఒంటరి పోరాటం చేస్తున్నారు. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీతో చేతులు కలపబోతున్నారా అంటే అవుననే వార్తలు వినపడుతున్నాయి.

ప్రస్తుతం 2024 ఎన్నికల పై రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున తన గళం వినిపిస్తున్నారు. 2024 ఎన్నికలలో పెద్ద ఎత్తున మోసం జరిగిందని ఈవీఎంల ద్వారా ఎన్డీఏ గెలిచింది అంటూ ఈయన ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం తప్పిదాలు చేసిందంటూ రాహుల్ మాట్లాడుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మాటలకు వైసీపీ సోషల్ మీడియా పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతుంది. ఇక ఏపీలో కూడా ఈవీఎం ద్వారానే కూటమి గెలిచింది అంటూ ఎంతో మంది నేతలు డిపాజిట్లు కట్టి మరీ ఎంక్వైరీకి ముందుకు వెళ్తున్నారు.

ఇలా కూటమి విజయం ప్రజా విజయం కాదని, ఈవీఎంల గెలుపు అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే జగన్ రాహుల్ గాంధీతో చేతులు కలిపితే అసలు విషయం బయట పడుతుందని పలువురు భావిస్తున్నారు కానీ జగన్మహన్ రెడ్డి మాత్రం అంత సాహసం చేయరని తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కు అనుకూలంగా జగన్ మారితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి తిరిగి జగన్ మోహన్ రెడ్డి కేసులను తిరగతోడే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే జగన్ రాహుల్ గాంధీతో చేతులు కలిపే సమస్య లేదని తెలుస్తోంది.