సౌందర్యతో రానని చెప్పేసిన శౌర్య…. దీపకు అడ్డంగా దొరికిపోయిన డాక్టర్ బాబు!

కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. అయితే నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…సౌందర్య డాక్టర్ చారుశీలతో మాట్లాడుతూ ఉంటుంది చాటుగా కార్తీక్ వారి మాటలను వింటాడు. సౌందర్య తనకు శౌర్య అడ్రస్ కావాలని అడుగుతుంది. సౌర్య కోసం మేం వెతుకుతున్నట్టు తెలుసుకున్న టువంటి ఇంద్రుడు చంద్రమ్మ ప్రతిసారి ఇల్లు మారుతూ ఉన్నారు తన అడ్రస్ కావాలి అని సౌందర్య అడుగుతుంది.

ఇక చారుశీల మాట్లాడుతూ శౌర్య వచ్చి కేవలం పోస్టర్ అతికించి వెళ్లిందని తన అడ్రస్ తెలియదని సమాధానం చెబుతుంది.కనిపించని నా కొడుకు కోడల కోసం నేను ఎంత తాపత్రయంగా వెతుకుతున్నానో తన తల్లిదండ్రుల కోసం సౌర్య కూడా అంతే కష్టపడుతుంది అంటూ సౌందర్య ఎమోషనల్ అవుతుంది.శౌర్య అడ్రస్ తనకు కావాలని సౌందర్య అడగడంతో డ్రైవర్ ను తోడుగా పంపించి ఇంటి దగ్గర దింపించాను.అడ్రస్ ఇవ్వమని అడిగితే వద్దు మీరు వెళ్లే లోగా ఏమైనా జరగవచ్చు రేపు ఉదయం సౌర్య ఇక్కడికి పిలిపిస్తాను మీరు కూడా రండి అని చారుశీల చెబుతుంది.

ఇక సౌందర్య వెళుతూ ఉండగా చారుశీల ఇక్కడే ఉంటే తన తల్లిని మరి కాసేపైనా కార్తీక్ చూసుకుంటాడని సౌందర్యను తిరిగి వెనక్కి పిలుస్తుంది. అసలు మీ కొడుకు కోడలు బ్రతికే ఉన్నారని అనుమానం మీకు, శౌర్యకు ఎందుకు వచ్చిందని చారుశీల సౌందర్యం ప్రశ్నించగా..అది కనపడగానే తాను అడగాలనుకున్న మొదటి ప్రశ్న కూడా ఇదేనని సౌందర్య చెబుతుంది. అయితే రేపు ఉదయం తొందరగా వచ్చేయండి నేను ఇక్కడికి పిలిపిస్తాను అని చెప్పడంతో సౌందర్య వెళ్ళిపోతుంది.

మరోవైపు ఇంద్రుడు చంద్రమ్మ కొద్దిరోజులే జ్వాలమ్మ మన దగ్గర ఉంటుంది. ఇక తిరిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతుందని మాట్లాడుకుంటూ ఉంటారు.అంతలోగా సౌర్య అక్కడికి వచ్చి చారుశీల మేడం ఫోన్ చేసింది నన్ను ఒక్కదాన్నే రమ్మని చెబుతోంది అంటూ ఇంద్రుడు చంద్రమ్మకు చెబుతారు. దాంతో ఇంద్రుడు చంద్రమ్మ మేం కూడా వస్తామని ముగ్గురు హాస్పిటల్ కి వెళ్తారు.మరోవైపు కార్తీక్ ఎప్పటిలాగే శౌర్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ ఇంద్రుడు చంద్రమ్మ దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నారు వారిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అంటుంది.

కార్తీక్ నువ్వు శౌర్య గురించి ఆలోచించడం మానేయి నేనున్నాను కదా అని చెబుతాడు అంతలోపు టాబ్లెట్స్ తెచ్చి ఇవ్వడంతో ఇంకా ఎన్ని రోజులు వేసుకోవాలి డాక్టర్ బాబు టాబ్లెట్స్ అనగా నువ్వు బ్రతికి ఉన్నన్ని రోజులు అని మనసులో బాధపడతాడు.ఇది ఆరు నెలల కోర్సు దీప ఆరు నెలల పాటు తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పి తనకు టాబ్లెట్స్ వేస్తాడు.మరోవైపు హాస్పిటల్ కి వచ్చిన సౌర్య అక్కడ సౌందర్యను చూసి వెంటనే వెనక్కి వెళ్లి పదండి వెళ్దాం అంటూ తన పిన్ని బాబాయ్ కి చెబుతుంది.అప్పటికే అక్కడికి సౌందర్య వచ్చి తనని వెంట తీసుకెళ్దాం అని చెప్పినప్పటికీ శౌర్య రానని తెగేసి చెబుతుంది.

వీళ్లు మాయ మాటలతో నిన్ను పూర్తిగా మార్చేశారు అని సౌందర్య చప్పగా వాళ్ళు నేను చెప్పినట్టే చేస్తున్నారని వాళ్ళని ఏమీ అనద్దు అంటూ సౌర్య అడ్డుకుంటుంది. మీరు నన్ను వదిలేసి అమెరికా వెళ్ళిపోయారు మొన్న కూడా వస్తానని చెప్పి రాలేదు నేను మీకు ఎవరికి అవసరం లేదు నానమ్మ అంటూ సౌర్య చెప్పగా ఇప్పుడు రమ్మంటున్నాను కదా రా అని సౌందర్య బ్రతిమలాడినప్పటికీ శౌర్య మాత్రం వెళ్ళనని చెబుతుంది. అమ్మానాన్నలు చనిపోవడానికి కారణమైన ఈ హిమ ఉన్నచోట నేను ఉండనని శౌర్య చెప్పడంతో ఒకరి కర్మకు మరొకరు బాధ్యులు కారు రమ్మని సౌందర్య బ్రతిమలాడిన శౌర్య వెళ్ళనని చెబుతుంది అయితే మరోవైపు కార్తీక్ ఇదంతా చేయిస్తున్నాడని దీపకు అనుమానం కూడా కలుగుతుంది.