Mohan Babu: సినీనటి సౌందర్య మరణం గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్న అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. అయితే రాజకీయ ప్రచార కార్యక్రమాలలో భాగంగా సౌందర్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో ఆమె మరణించారు.
సౌందర్య మరణించి దాదాపు 20 సంవత్సరాలు పైన అవుతున్న నేపథ్యంలో ఇటీవల చిట్టిబాబు అనే వ్యక్తి సౌందర్య మరణం వెనుక కుట్ర ఉందని సౌందర్యను మోహన్ బాబు కుట్రలో భాగంగానే చంపేశారు అంటూ ఫిర్యాదు చేశారు అంతేకాకుండా జల్పల్లిలో సౌందర్యకు ఉన్నటువంటి ఆరు ఎకరాల ఫామ్ హౌస్ విషయంలో వీరిద్దరి మధ్య గొడవచోటు చేసుకుందని చిట్టిబాబు తెలిపారు.
ఇలా ఆ ఫామ్ హౌస్ తనకు కావాలని మోహన్ బాబు అడగడం సౌందర్య, ఆమె సోదరుడు అందుకు నిరాకరించడంతో మోహన్ బాబు వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని అందులో భాగంగానే ఆమె హత్యకు ప్లాన్ చేశారు అంటూ ఆరోపణలు చేశారు. సౌందర్య మరణం తర్వాత ఆ ఫామ్ హౌస్ నీ మోహన్ బాబు లాక్కొని ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇలా సౌందర్యం మరణం గురించి అలాగే ఆస్తి తగాదాల గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ మోహన్ బాబు మాత్రం ఈ వార్తలు ఎక్కడ స్పందించలేదు కానీ సౌందర్య భర్త రఘు మాత్రమే స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌందర్య మరణం గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.
హైదరాబాదులో సౌందర్య ఆస్తికి సంబంధించి గత కొద్దిరోజులుగా తప్పుడు వార్తలు వస్తున్నాయి. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నారు అంటూ వస్తున్న వార్తలను తాను ఖండిస్తున్నానని తెలిపారు..ఆయనతో సౌందర్య ఎలాంటి లావా దేవీలు జరపలేదు. వారి కుటుంబంతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. నేను మోహన్‌బాబును ఎంతో గౌరవిస్తా. మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాము మాకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవు అలాగే ఎలాంటి లావాదేవీలు కూడా లేవు అంటూ రఘు క్లారిటీ ఇచ్చారు.