Jr NTR: ఎన్టీఆర్ న్యూ స్టైల్.. ఆ చొక్కా ధ‌ర ఎంతంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల షెడ్యూల్‌ల నుంచి బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ టైమ్‌ను ఆస్వాదిస్తున్న తారక్‌ అక్కడ పలు ప్రదేశాలు సందర్శిస్తూ అభిమానులను కూడా కలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ గ్రూప్ ఫ్యాన్స్‌తో కలిసి తారక్‌ దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో ఎన్టీఆర్ ధరించిన నీలి రంగు పూల చొక్కా అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా సింపుల్‌గా కనిపించిన ఆ షర్ట్ ఖరీదు ఎంతంటే.. దాదాపు రూ. 85 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది ‘ఎట్రో’ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు చెందింది. ఒక్క చొక్కాకే అంత ఖర్చు చేశారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపడుతున్నారు. అయితే “స్టైల్, క్లాస్ విషయంలో తారక్‌ రేంజే వేరు” అంటూ ఫ్యాన్స్‌ గర్వంగా కామెంట్లు చేస్తున్నారు.

తారక్ లుక్ ఎంత సింపుల్‌గా ఉన్నా, ఆయన వేసుకునే దుస్తులు మాత్రం ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. అభిమానులు మాత్రమే కాదు, ఫ్యాషన్ ప్రియులకూ ఎన్టీఆర్ స్టైల్ ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్ లాంటిదే. సాధారణమైన పంచెకట్టులోనూ, పార్టీల లుక్‌లోనూ తారక్‌కు ఉన్న గ్లామర్ టచ్ వేరే లెవెల్‌ అని అందరూ అంటున్నారు.

ఇప్పుడు సినిమాల పరంగా చూస్తే ఎన్టీఆర్ వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ షూటింగ్‌ను కంప్లీట్ చేసిన తారక్, ఈ నెల 22 నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నారు. తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లో ‘దేవర 2’ సెట్స్ మీదకి వెళ్లనున్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు స్టైల్ ఐకాన్‌గా తారక్‌ పాతికేళ్ల కెరీర్‌కి మరో కొత్త మోడ్‌ను తెచ్చుకుంటున్నారు.

YCP, Janasena Parties Future in AP Next Elections | YS Jagan | Pawan Kalyan | Telugu Rajyam