Mohan Babu: సినీనటి సౌందర్య మరణించి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది అయితే ఇలా 20 సంవత్సరాల తర్వాత మరోసారి నటి సౌందర్య మరణానికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సంచలనగా మారింది.. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు అయితే ఈమె మరణం చాలా సహజ మరణమే అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఓ వ్యక్తి సౌందర్యది సహజ మరణం కాదని ఆమె మరణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పడంతో సంచలనాలు రేగాయి.
ఇక సౌందర్య హత్యకు కుట్ర ప్లాన్ చేసింది కూడా టాలీవుడ్ హీరో అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు సౌందర్యం మరణం వెనుక ఏం జరిగింది? అసలు ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. సౌందర్య సహజ నటిగా ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన తక్కువ సమయంలోనే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
ఈమె మరణించి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ తనని అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలోని సౌందర్యం మరణం వెనుక కుట్ర జరిగిందని తెలిసి షాక్ అవుతున్నారు. సౌందర్య మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉంది అంటూ
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురు గట్ల చిట్టిబాబు ఈ ఆరోపణలు చేస్తున్నాడు. సినీనటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ కలెక్టర్ ఖమ్మం రూరల్ ఏసిపికి ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం హైదరాబాదులో జెల్ పల్లి లో మోహన్ బాబు నివాసం ఉంటున్నటువంటి ఆ ఆస్తులన్నీ కూడా సౌందర్యవేనని సౌందర్య నుంచి ఆస్తులను లాక్కోవడం కోసం మోహన్ బాబు కుట్ర చేశారని ఈయన ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరోయిన్ సౌందర్యకు శంషాబాద్ జల్లేపల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని తెలిపారు.
ఇలా సౌందర్య తన తమ్ముడు నిరాకరించడంతో మోహన్ బాబు కక్ష పెంచుకున్నారని బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న వారిని సాక్షాలు దొరక్కుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని, ఆ తర్వాత జల్లేపల్లిలో ఉన్న ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ని అక్రమంగా అనుభవిస్తున్నాడని చిట్టిబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఈ విషయాలు చెప్పిన ఈయన మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలని కోరడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది..