పరీక్ష రాయకుండానే బ్యాంకులో ఉద్యోగం.. ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలంటే?

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. ఏప్రిల్ నెల 18వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం పొందాలని భావించే వాళ్లకు ఈ జాబ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.

 

చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 18, 2025 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ పోస్టుకు ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలి.

 

కనీసం 18 సంవత్సరాల పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవికి అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు అయి ఉండటం కచ్చితం అని చెప్పవచ్చు. అనుభవం ఆధారంగానే అభ్యర్థి పని సామర్థ్యాన్ని అంచనా వేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు అయ్యి ఉండాలి.

 

పదవీ విరమణ చేసిన లేదా డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్న అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. http://www.ippbonline.com వెబ్ సైట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.