SSMB29 గ్లింప్స్‌కి ప్లాన్ సిద్ధమేనా?

సూపర్‌స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ అంటే కేవలం సినిమా మాత్రమే కాదు… భారత సినీ ప్రపంచానికే ఓ పండుగగా మారే అవకాశం ఉంది. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన రాజమౌళి, ఇప్పుడు మహేష్‌తో మళ్లీ అలాంటి విశ్వవిజ్ఞానాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారని ఇండస్ట్రీలో బలమైన టాక్.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్డేట్స్ పెద్దగా రాకపోయినా, లొకేషన్ ఫోటోలు, షూటింగ్ స్పాట్స్ నుంచి లీకైన సమాచారం మాత్రం భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఇప్పుడు ఓ స్పెషల్ గ్లింప్స్ వీడియో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం టైటిల్ రివీల్ మాత్రమే కాకుండా, సినిమాలోని టోన్, థీమ్, మహేష్ లుక్‌తో పాటు అడ్వెంచర్ ఎలిమెంట్స్‌ను చూపించేలా డిజైన్ చేస్తున్నారట. ఈ వీడియో కోసం ఇప్పటికే ప్రీ విజ్యువలైజేషన్ పనులు మొదలయ్యాయని సమాచారం.

గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ కథలో మహేష్ బాబు ఓ ప్రపంచ యాత్రికుడిగా కనిపించనున్నారన్నది తెలిసిన విషయం. రాజమౌళి మాటల ప్రకారం, ఇది భారతీయ సినిమా చూసే తీరును మార్చే ప్రయోగం. ఈ నేపధ్యంలో గ్లింప్స్ వీడియో ఒక నూతన సినీ ప్రపంచానికి తలుపులు తెరచే విండోలా మారనుంది. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, వెస్ట్రన్ థీమ్ ఫీల్‌తో ప్రెజెంట్ చేయబోయే ఈ వీడియోకు భారీ మేకింగ్ ఉండనుంది.

ఈ స్పెషల్ గ్లింప్స్ జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశముందట. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కెఎల్ నారాయణ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఒకవేళ ఈ గ్లింప్స్ విడుదలైతే, అది SSMB29 హైప్‌ను ఇంకొంచెం మల్టిప్లై చేయడం ఖాయం.

జగన్ హత్య కు కుట్ర || Ks Prasad EXPOSED AB Venkateswara Rao Meets Kodi Kathi Srinu || Ys Jagan | TR