ప్రభాస్ నటిస్తున్న హరర్ కామెడీ ఎంటర్టైనర్ రాజా సాబ్ సినిమాపై అప్డేట్ రావాల్సిన సమయంలో, మళ్లీ మళ్లీ గందరగోళమే పెరిగిపోతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. మిగిలిన భాగంగా కొన్ని పాటలు, టాకీ పార్ట్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నా, విడుదల తేదీపై మాత్రం స్పష్టత లేకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇటీవల మారుతి వీఎఫ్‌ఎక్స్ పనుల వల్లే ఆలస్యం జరుగుతోందని స్పష్టం చేసినా, 3డి ఫార్మాట్ విషయంలో తాజా బజ్ వినిపిస్తోంది. సినిమా విజువల్‌గా మరింత రిచ్‌గా ఉండేందుకు 3డి వర్షన్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారని సమాచారం. ఇది నిజమైతే విడుదల మరో మూడు నెలలు ఆలస్యం కావచ్చు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, బాలీవుడ్ స్టూడియో మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడం వల్ల నిర్మాణ వేగం కూడా తగ్గిందన్న టాక్ ఉంది.
ఇలా టెక్నికల్ అంశాలే కాదు, అధికారిక సమాచారం లేకపోవడమే అసలు సమస్యగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాకు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అభిమానుల నిరాశకు దారి తీస్తోంది. సినిమా కథ, కామెడీ, ఎమోషన్, విఎఫ్ఎక్స్ అన్నీ మిక్స్ అవుతున్నా… ఎలాంటి ప్రమోషనల్ ప్లాన్ బయటపెట్టకపోవడం వల్ల సినిమాపై ఊహాగానాలే ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ మరో సినిమా షూట్‌తో బిజీగా ఉన్నప్పటికీ, రాజా సాబ్ పూర్తయిన వెంటనే ప్రమోషన్ల దిశగా ముందుకు వెళ్లే యోచనలో ఉన్నాడు. ఇక గాసిప్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టాలంటే, యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిన సమయం ఇదే.


