Venky Atluri: వెంకీ అట్లూరి.. ఇప్పుడు స్టార్ హీరోలే టార్గెట్!

వెంకీ అట్లూరి అనే పేరు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో ఫుల్ క్రేజ్‌లో ఉంది. ‘తొలిప్రేమ’తో దర్శకుడిగా మెరిసిన వెంకీ, మధ్యలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ, సార్ సినిమా ద్వారా మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చారు. ధనుష్‌తో చేసిన ఆ సినిమా రెండు భాషల్లోనూ విజయాన్ని అందుకుంది. ఆ విజయం తర్వాత వచ్చిన లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే బిగ్ హిట్స్ గా నిలిచాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకీ అట్లూరి ప్లానింగ్ చూస్తే, కచ్చితంగా స్టార్ డైరెక్టర్ల లైన్లోకి చేరనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం సూర్యతో చేస్తున్న సూర్య 46 ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది వెంకీ కెరీర్‌లో మరొక కీలక మలుపు కావొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతేకాదు, కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‌తో వెంకీ ఓ మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కథ ఇంకా నెరేట్ చేయనప్పటికీ, ముందస్తు చర్చలు నడుస్తున్నాయని టాక్. వెంకీ ట్రాక్ రికార్డు చూసిన అజిత్ టీమ్ ఆసక్తిగా ఉందట. ఇక మెగాస్టార్ చిరంజీవితో వెంకీ సినిమా గురించి గతంలోనూ గుసగుసలు వచ్చాయి. ఇప్పుడు కథ ఫైనల్ అయితే త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.

ఇలా వెంకీ అట్లూరి వరుసగా స్టార్ హీరోలతో ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టుకుంటూ, తన స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కథల ఎంపిక, సినిమాటిక్ ప్రెజెంటేషన్‌లో ఆయన చూపిస్తున్న నైపుణ్యం చూసి, ఈ తరం మిడిల్ రేంజ్ నుంచి స్టార్ డైరెక్టర్‌గా మారబోతున్న దర్శకుడిగా అందరూ చూస్తున్నారు. ఇకపై వెంకీ ఏ స్టార్‌ను ఎక్కడ టచ్ చేస్తాడో చూడాలి.

వర్షిణీ తో అఘోరి || Dasari Vignan EXPOSED Lady Aghori Marriage With Sri Varshini || Telugu Rajyam