కర్ణుడుగా విక్రమ్… 300 కోట్లకి పైగా బడ్జెట్!

తమిళ  నటుడు విక్రమ్ కర్ణుడుగా నటిస్తున్నాడు . మలయాళ  దర్శకుడు  ఆర్ .ఎస్  విమల దర్శకత్వంలో తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మాణమవుతుంది . జనవరి లో ఈ చిత్రంహైద్రాబాద్ రామోజీ ఫిలిం సిటీలోప్రారంభ మవుతుందని దర్శకుడు తెలిపారు .

మహా భారతంలో కర్ణుడు పాత్రకు ఒక ప్రత్యేకత ఉందని , స్నేహం కోసం ప్రాణాలను సైత ఇచ్చే  మహోన్నత వ్యక్తిత్వం కలవాడని , ఇక దాన కర్ణుడనే పేరు ఉండనే ఉందని ఆయన చెప్పారు . ఈ పాత్ర కోసం విక్రమ్ మానసికంగా శారీరకంగా సిద్దపడుతున్నదని , ఆ పాత్ర కోసం తగిన శిక్షణ  తీసుకుంటున్నాడని  విమల్ తెలిపారు .

ఈ చిత్రం షూటింగ్ ఆరు నెలల పాటు  రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుందని అందుకు తగ్గ సెట్స్ నిర్మాణం జరుగుతుందని ఆయన చెప్పారు . కర్ణ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నామని , మిగతా నటీనటులు , సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటిస్తామని విమల్ చెప్పారు .

మహా భరత్ లోని కర్ణ గురించి ఇప్పటికే సినిమాలు వచ్చాయని ఐతే  మా సినిమా కర్ణ పాత్ర  కోణంలో నుంచి చెప్పడం  జరుగుతుందని తెలిపారు .

1964లో శివాజీ గణేశన్  నటించిన కర్ణ సినిమా  వచ్చింది . కర్ణుడుగా శివాజీ గణేశన్ నటించగా  శ్రీకృష్ణుడుగా ఎన్టీ రామారావు నటించారు . సావిత్రి, దేవిక ఇతర పాత్రల్లో నటించారు . ఈ చిత్రాన్ని బి .ఆర్ పంతులు నిర్మించి దర్శకత్వం వహించాడు . మళ్ళీ ఇన్నాళ్లకు తమిళంలో కర్ణుడుగా విక్రమ్ నటిస్తున్నాడు .