ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన కథానాయకుడు చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో సెకండ్ పార్ట్ మహానాయకుడుని ఫ్రీగా డిస్ట్రిబ్యూటర్స్ కు ఇవ్వాల్సిన పరిస్దితి ఏర్పడింది. మరో ప్రక్క ఈ సినిమాకు కౌంటర్ పార్ట్ గా రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మాత్రం మంచి క్రేజ్ ఏర్పడింది.
ట్రేడ్ సర్కిల్స్ లో ఈ సినిమాపై ఓ రేంజిలో డిస్కషన్ స్టార్టైంది. దాంతో వర్మకు ఓ రేంజిలో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు వినికిడి. రీసెంట్ గా ఓ నిర్మాత ..మొత్తం థియోటర్ రైట్స్ కు పాతిక కోట్ల వరకూ ఆఫర్ చేసారట. అయితే ఈ చిత్రం రైట్స్ తీసుకుని ఆ తర్వాత రిలీజ్ కాకుండా ఆపే ప్లాన్స్ కొందరు వేస్తున్నారట. ఈ విషయం వర్మ చెవిన పడిందని, అందుకే ఆచి , తూచి అడుగులు వెయ్యాలని ఫిక్స్ అయ్యారట.

దాంతో టీజర్ కూడా రిలీజ్ కాకుండా ఈ స్దాయిలో ఆఫర్స్ వస్తూంటే..కంగారుపడటం ఎందుకని నిర్మాతకు ధైర్యం చెప్పిన వర్మ సైలెంట్ అయ్యిపోయారట. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత బిజినెస్ మొదలెడదాం అని ఆ పార్టీ చెప్పి ఆపారట. అయితే టీజర్ క్లిక్ అయ్యి, వివాదాస్పదమయితే ..ఖచ్చితంగా మరింతగా జనం బిజినెస్ కోసం వాలిపోతారు.
అప్పుడు రేటు పెంచి చెప్పవచ్చు అనేది వర్మ ప్లాన్ అంటున్నారు. దానికి తోడు వివాదాలు కూడా ఈ సినిమాకు ఎప్పటిలాగే ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి. రిలీజ్ టైమ్ లో కూడా ఖచ్చితంగా మీడియా రెచ్చిపోతుంది. అదంతా సినిమాపై జనాలకు ఆసక్తి కలిగేందుకు పనికొస్తుంది అంటున్నారు.
రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకు సంబందించిన ఫొటోలతో పాటలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ పై అంచనాలు భారీగా పెంచుతున్నాడు. రీసెంట్ గా సినిమాలోని ప్రధాన పాత్రల ఫోటోలను రిలీజ్ చేసిన వర్మ ..వెన్ను పాట రిలీజ్ చేసి వివాదం లోకి అడుగు పెట్టారు. ఎన్టీ రామారావు నిజమైన జీవిత చరిత్రని “లక్ష్మీస్ ఎన్టీఆర్”లో చూపిస్తున్నాను అని వర్మ అంటూ ఆయన సెన్సేషన్ చేసే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ పాత్రని ఒక థియేటర్ నటుడు పోషిస్తుండగా, లక్ష్మీపార్వతి పాత్రని యక్ష షెట్టి పోషిస్తోంది.
