రాజమౌళి కొడుకు, అసెస్టెంట్ కలిసి…

రాజమౌళి …ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. మరో ప్రక్క ఆయన కుమారుడు కార్తికేయ నిర్మాతగా మారి ఓ సినిమా చేయబోతున్నాడు.

తన తండ్రి రాజమౌళి దగ్గర బాహుబలి సీరీస్ కు అసిస్టెంట్ గా పనిచేసిన అశ్విన్ గంగరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ‘ఆకాశవాణి’ అనే సినిమాను తీస్తున్నాడని సమాచారం. ఈ మేరకు టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించారు.

రాజమౌళి తన శిష్యుడు అశ్విన్ గంగరాజుతో ..

ఇక కార్తికేయ నిర్మాతగా మారుతున్న విషయాన్నీ గతంలోనే రాజమౌళి ఓ సందర్భంలో ప్రకటించాడు. కార్తికేయకి సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపై పట్టు ఉండటం కలిసొచ్చే అంశం. రాజమౌళి సినిమాలకి సంబంధించిన చాలా విషయాలను కార్తికేయ దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు. దాంతో రాజమౌళి లాగానే ఆయన మెగా ఫోన్ పట్టుకోవచ్చని అంతా అనుకున్నారు.

దర్శకత్వంపై కార్తికేయకి ఇంట్రస్ట్ వుందో లేదో గానీ, నిర్మాతగా మారడానికి రంగాన్ని సిద్ధం అయ్యింది. చారిత్రక నేపథ్యంలో రూపొందే ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.