ప్రేమకు రెయిన్ చెక్ : ఆగస్టు 23 విడుదలకు సిద్దం

ఆగస్ట్ 23న విడుదలకు సిద్దంగా ఉన్న యూత్ ఫుల్ లవ్ స్టొరీ “ప్రేమకు రెయిన్ చెక్”

శరత్ మరార్ – నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సమర్పణ లో స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రొడక్షన్ ‘ప్రేమకు రెయిన్ చెక్ ‘ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదలయ్యింది. కొత్త తారాగణంతో నూతన దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ ‘ప్రేమకు రెయిన్ చెక్’ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్న సంగతి మనకు తెలిసిందే.

‘ప్రేమకు రెయిన్ చెక్’ టైటిల్ నుంచే కోతదాన్ని ప్రక్షకులకి అందించిన చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసిన ట్రైలర్ తో అంచనాలని పెంచేసింది. ప్రస్తుత యువత (మిల్లెనిఅల్స్) ని దృష్టి లో ఉంచుకొని ఈ కథ చెప్పే ప్రయత్నం చేసామని ఇంతకముందే దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే, కొత్తదనంతో పాటు ఛాయాగ్రణం మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో మొదట ఆకర్షించే విషయం ఈ చిత్ర ఛాయాగ్రహణం, శరత్ గురువుగరి తన కెమెరా తో చూపించిన విజువల్స్ అధ్బుతంగా ఉన్నాయి. 

చిత్ర సంగీతం విడుదలైన మూడు పాటల రుచి చూసిన ప్రేక్షకులు, ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కచ్చితంగా ఆకర్షితులు అవుతారు. లవ్ స్టోరీస్ లో మెలోడీ ముఖ్యమైన అంశం, ‘ప్రాణమా’ పాట కొంచం చూపించిన చిత్ర బృందం, ఈ పాట ఇంకా వినాలన్న ఉత్సాహాన్ని పెంచి, ప్రేక్షకులని ఊరించారు. ఈ పాట విడుదల కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. చిత్ర ఛాయాగ్రణం, మ్యూజిక్ ఒక దానికి ఒకటి పోటి పడుతునట్టు కనపడుతుంది.  వీటితో పాటు ఈ ట్రైలర్ లో మనము గమనిచాల్సింది కొత్త నటీనటీలతో పాటు సుమన్, రఘు కారుమంచి, కిరీటి దామరాజు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.అభిలాష్, ప్రియల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో వెండి తెర పై చూడాలి. 

ఈ చిత్రం లో ఒక వ్యక్తి  తన ప్రేమకు రెయిన్ చెక్ ఇచ్చి కెరీర్ కి ప్రాముఖ్యత ఇచ్చి తన జీవితాన్ని ఎలా కంప్లికేట్ చేసాడు అన్నది కథ అన్నది దర్శకులు తెలిపినప్పటికీ, ప్రేమ, అడ్వెంచర్ స్పోర్ట్స్, కార్పొరేట్ సెటప్  ట్రైలర్లో చూస్తే ఇంకా కథాంశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. మాటలు కూడా కొత్తగా నేటి యువతను ఆకర్షించే లా ఉన్నాయి.  ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ చిత్ర బృందం, ఈ చిత్రాన్ని ఈ నెల 23 న ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు.