ఆ ముగ్గురి మధ్య ఏంజరిగింది ?

ఆ ముగ్గురి మధ్య ఏంజరిగింది ?

పనసేనాని పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ ఈరోజు చిరంజీవిని కలుసుకున్న వార్త ఆసక్తిగా మారింది . చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిని కలవడానికి వెళ్ళాడు . ఇందులో విశేషం ఏముంది అనుకోవచ్చు. కానీ పవన్ తో పాటు జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా చిరంజీవిని కలుసుకున్నాడు . ఈ విషయాన్ని మనోహర్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు .

చిరంజీవి , పవన్ , మనోహర్ చాలాసేపు చిరంజీవితో గడిపారు .” చాలా అపురూపంగా చిరంజీవితో సమావేశం జరిగింది . దీనిని మాటల్లో చెప్పలేను. చిరంజీవి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది .. ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నాను “అని మనోహర్ తెలిపారు . వారి ముగ్గురు అనేక విషయాల మీద మాట్లాడుకున్నారట . ఈ సమావేశానికి ఎదో ప్రాధాన్యత వుంది . అదేమిటి అనేది బయటికి రాలేదు .