Unstoppable S4: ‘అన్‌స్టాపబుల్‌’ సీజన్‌ 4లో విక్టరీ వెంకటేశ్‌ & సంక్రాంతి వస్తున్నాం టీం సందడి- గ్లింప్స్ వైరల్

Unstoppable S4: గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్‌ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెన్సేషనల్ షో ‘అన్‌స్టాపబుల్‌’ సీజన్‌ 4 లేటెస్ట్ ఎపిసోడ్‌కు వెంకటేశ్‌ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్లింప్స్‌ విడుదల చేశారు. గ్లింప్స్ లో వెంకటేశ్‌, బాలకృష్ణ స్టైల్‌లో తొడగొడుతూ, వెంకటేశ్‌ స్టైల్‌ను బాలకృష్ణ అనుకరిస్తూ కనిపించడం వైరల్ గా మారింది.

ఈ ఎపిసోడ్ లో ‘సంక్రాంతి వస్తున్నాం’ టీం కూడ సందడి చేయబోతోంది. అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్‌ ఈ నెల 27 రాత్రి 7 గంటల నుంచి ఓటీటీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌ కానుంది.