ఆ సమయంలో భయం వేసింది.. పీలింగ్స్ సాంగ్ పై రష్మిక కామెంట్స్!

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,500 ధియేటర్లలో ఆరు భాషలలో రిలీజ్ అయిన సినిమా పుష్ప 2 రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే 1600 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టి అతి తక్కువ రోజులలోనే అన్ని వందల కోట్లు సంపాదించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. డైరెక్టర్ సుకుమార్ విజన్ కి అల్లు అర్జున్ యాక్షన్ తన స్టైల్ లో చూపించిన విలనిజం సినిమాకి హైలెట్ అని చెప్పాలి.

ఇక రష్మిక మందన్న అయితే తన నటనతో ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్ళింది అని చెప్పొచ్చు. సినిమాలో ఆమె నటన, ఆమె హావభావాలు, ఆమె డాన్స్ అన్ని కూడా ఓ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమాలో వచ్చే ఫీలింగ్స్ పాట లో రష్మిక అల్లు అర్జున్ వేసిన డాన్స్ అయితే సంచలనం రేపింది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో డాన్స్ స్టెప్స్ పై సోషల్ మీడియా వేదికగా పలువురు అభ్యంతరం తెలిపారు.

మరికొందరేమో కొత్తగా ట్రై చేశారు బాగుందంటూ మెచ్చుకున్నారు అయితే తాజాగా రష్మిక మందన్న ఈ సాంగ్ పై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని చెప్పింది. పీలింగ్స్ రిహార్స్ ల్స్ వీడియో చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను అల్లు అర్జున్ సార్ తో కలిసి డాన్స్ చేశాను అని మురిసిపోయాను. అయితే ఈ సాంగ్ చేసినప్పుడు మొదట చాలా భయం వేసింది, ఎవరైనా నన్ను ఎత్తుకుంటే నాకు చాలా భయం అలాంటిది ఈ పాటలో సర్ నన్ను ఎత్తుకొని స్టెప్ వేస్తారు, మొదట అసౌకర్యంగా ఫీల్ అయ్యాను కానీ సుకుమార్, బన్నీ సార్ నన్ను ఆ ఇబ్బంది నుంచి బయట పడేశారు.

ఒకసారి ఆయనను నమ్మాక అదేమంతా ఇబ్బందిగా అనిపించలేదు అంతా ఫన్ గా జరిగిపోయింది. నేనున్నది జనాలని ఎంటర్టైన్ చేయడానికి మరీ ఎక్కువ ఆలోచిస్తే నా కొమ్మను నేనే నరక్కున్నట్లు అవుతుంది అలా చేయడం నాకు ఇష్టం లేదు నాపై నేనే డౌట్ పడితే నటిగా రాణించడం కష్టం. ఇకపోతే ఫీలింగ్స్ పాట అందరికీ నచ్చకపోవచ్చు ఒక పాట అందరికీ నచ్చాలని ఏం లేదు అని చెప్పుకొచ్చింది రష్మిక.