హైకోర్టు లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, సెన్సార్ బోర్డ్ కు నోటీసులు

వివాదాలు, కోర్టులు, తీర్పులు లేనిదే వర్మ సినిమా చెయ్యలేరా…అంటే నిజమే అనాలనిపిస్తోంది. తాజాగా ఆయన రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సైతం ఇప్పుడు కోర్టు గుమ్మం ఎక్కింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక‌రు ఈ సినిమాపై హైకోర్టుని ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళితే…రామ్ గోపాల్ వర్మ ఫొటోలతో పాటలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ పై అంచనాలు భారీగా పెంచుతున్నాడు. రీసెంట్ గా సినిమాలోని ప్రధాన పాత్రల ఫోటోలను రిలీజ్ చేసిన వర్మ ..వెన్ను పాట రిలీజ్ చేసి వివాదం లోకు అడుగు పెట్టారు. ఎన్టీ రామారావు నిజ‌మైన జీవిత చ‌రిత్రని “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌”లో చూపిస్తున్నాను అని వ‌ర్మ అంటూ ఆయన సెన్సేషన్ చేసే పోగ్రాం పెట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్న “వెన్ను పాట”ను తొలగించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయమై విచారించిన కోర్టు దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకి నోటీసులు జారీ చేసింది. ఒక ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా పాట పెడితే ఆ పాట‌ని ఎలా సెన్సార్ చేశారు? అంటూ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. దీనిపై విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

అయితే వెన్నుపోటు పాట‌ని వ‌ర్మ యూట్యూబ్‌లో మాత్రమే విడుద‌ల చేశాడు. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన పాట‌కి సెన్సార్ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి కాదన్న సంగతి తెలిసిందే. ఇక్కడే వర్మ సేఫ్ అవుతాడు అంటున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌ని ఒక థియేట‌ర్ న‌టుడు పోషిస్తుండ‌గా, లక్ష్మీపార్వ‌తి పాత్ర‌ని య‌క్ష షెట్టి పోషిస్తోంది.