మెగాస్టార్ ఇంట్లో అత్య‌వ‌స‌ర భేటి..బాల‌య్య వ్యాఖ్య‌ల‌పైనా?

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కొద్ది సేప‌టి క్రిత‌మే  అత్య‌వ‌స‌ర భేటి ఏర్పాటు చేసారు. మీడియాకు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా ఈ భేటి నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం.  ఈ భేటి చిరంజీవి అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో పాల్గొనేందుకు నిర్మాత  సి. క‌ళ్యాణ్‌, నాగార్జున‌, త‌మ్మారెడ్డి, ఎన్. శంక‌ర్ స‌హా ప‌లువురు నేత‌లు హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో భేటిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కోంది. ముందుగా సీసీసీ ఆధ్వ‌ర్యంలో అందుతోన్న సేవ‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. రెండ‌వ విడ‌త స‌హాయానికి సంబంధించి ప్ర‌ధానంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది. అయితే దానికంటే ప్ర‌ధానంగా ఎమ్మెల్యే, న‌టుడు బాల‌కృష్ణ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుద‌ని స‌మాచారం.

బాల‌య్య విష‌యంలో సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ప్ర‌చారమైన సంగ‌తి తెలిసిందే.  బాల‌య్య పై ప‌రిశ్ర‌మ‌లో గ్రూప్ రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌ని, తెలంగాణ మంత్రి త‌ల‌సాని భేటితో ప‌రిశ్ర‌మ పెద్ద‌లు భూములు పంచుకునే క‌ర్యక్ర‌మం కూడా జ‌రుగుతోంద‌ని బాల‌య్య వ్యాఖ్యానించిన‌ నేప‌థ్యంలో  వాటిని బాల‌య్య వ‌ర్గీయులు బ‌ల‌ప‌రుస్తూ సోష‌ల్ మీడియా కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ప్ర‌తిగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు బాయ్య‌ల‌పై కౌంట‌ర్లు వేయ‌డంతో ప‌రిశ్ర‌మ‌లో వాతావ‌ర‌ణం వేడెక్కింది. వీట‌న్నింటిపై కూడా నేటి భేటిలో చ‌ర్చ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. భేటిలో బాల‌య్య ప్ర‌స్తావ‌న రాకపోతే గ‌నుక మ‌రో స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కేవ‌లం సీసీసీ గురించే చ‌ర్చ‌లు జ‌రిపితే బాల‌య్య‌ను మ‌ళ్లీ ఎందుకు పిల‌వ‌లేద‌ని అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు మ‌ళ్లీ  ప్ర‌శ్నించే అవ‌కాశం లేక‌పోలేదు. ఏదేమైనా ఈ సాయంత్రానికి దీనిపై ఓ క్లారిటీ రానుంది.