‘కాశ్మీర్ ఫైల్స్’ లా “రాజధాని ఫైల్స్”.. ఏపీలో జరిగిన యదార్ధ ఘటనలతో 

గత కోవిడ్ సమయంలోనే థియేటర్స్ లో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ గా మారిన చిత్రం “కాశ్మీర్ ఫైల్స్” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల మేర వసూళ్లు అందుకొని సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రం యదార్థ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

కాగా ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో మన తెలుగు నుంచి అది కూడా ఏపీలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా సినిమా వస్తే ఎలా ఉంటుంది అనేలా వస్తున్నా చిత్రమే “రాజధాని ఫైల్స్”. ఇప్పుడు ఏపీ రాజధాని ఏంటి అంటే “రోబో” సినిమాలో రజినీకాంత్ చెప్పినట్టు హైపోథెటికల్ క్వశ్చన్ అంటూ దాటవేయాల్సిన పరిస్థితి నెలకొంది.

దీనితో ఈ అమరావతి విషయంలోనే ఒక నేత చేసిన అహం కారణంగా అక్కడి వేల రైతులు ఎలా నష్టపోయారు అనే కాన్సెప్ట్ లో అయితే చేస్తున్న చిత్రమే “రాజధాని ఫైల్స్”. మరి ఈరోజు ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఇది ఎవరిని టార్గెట్ చేసి చేస్తున్నారో ఆల్రెడీ అందరికీ అర్ధం అయ్యిపోయింది.

అయితే ఇది అమరావతి రైతులకి అనుకూలంగా చేస్తున్న సినిమాగా దర్శకుడు రవిశంకర్ కంటమనేని తెరకెక్కిస్తున్నారు. దీనితో టాలీవుడ్ నుంచి అయితే ఈ ఎన్నికల ముందు మరో పొలిటికల్ సినిమా రాబోతుంది అని చెప్పాలి. ఆల్రెడీ “యాత్ర 2” అనే సినిమా ఈ ఫిబ్రవరిలో వస్తున్నా సంగతి తెలిసిందే. బహుశా ఆ సినిమాకి కౌంటర్ గా ఈ సినిమా వస్తుండడం కావచ్చు.