బాలయ్య నెక్స్ట్ లో ఛాన్స్ కొట్టేసిన “వాల్తేరు వీరయ్య” బ్యూటీ..!

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లాస్ట్ మూడు చిత్రాలు కూడా ఓ రేంజ్ లో హిట్ అయ్యి బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ అందుకోగా ఈ చిత్రాలు తర్వాత మెగా దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా చేస్తున్నారు.

మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రంలో ఇదే సినిమా దర్శకుడు బాబీ మరియు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భారీ హిట్ చిత్రం వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం గర్ల్ గా కనిపించిన ఊర్వశి రౌటేలా కూడా కనిపిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసింది.

అయితే ఈ చిత్రంలో ఈమె ఐటెం గర్ల్ లా కాకుండా ఆమెనే ఫీమేల్ లీడ్ అంటూ లేదా సినిమాలో ఒక పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టుగా ఆమెకి ఆమె చెప్పేసింది. దీనితో ఈ అప్డేట్ తో ఈమె ఈ చిత్రంలో ఉన్నట్టుగా ఖరారు అయ్యిపోయింది. మొత్తానికి అయితే ఈ యంగ్ అండ్ హాట్ బ్యూటీ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అది కూడా టాలీవుడ్ బిగ్ స్టార్స్ సినిమాల్లోనే ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది అని చెప్పాలి.

ఇక ముందు ఎన్ని చిత్రాల్లో కనిపిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే బాలయ్య సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతుందట. అలాగే ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో భోగట్టా.