మరోసారి పవన్ ని వదిలేసిన అభిమానులు.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఇదే ఫాలోయింగ్ అభిమానులని నమ్ముకొని పవన్ రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. అయితే పవన్ ఏదన్నా మీటింగ్ పెడితే భారీ లెవెల్లో అభిమానులు వస్తారు.

ఈ జనాకర్షణకి పవన్ కి వచ్చిన ఓట్స్ కి పొంతన లేదు దీనితో తనతో పవన్ అభిమానులే నిలబడలేదని పవన్ వాపోయాడు. కాగా ఇదే హైపర్ తో ఫ్యాన్స్ మొన్న తెలంగాణాలో కూడా భారీ లెవెల్లో వచ్చి ఓట్స్ వెయ్యలేదు. ఇలా హైప్ లేపి మరోసారి అయితే పవన్ ఫ్యాన్స్ పవన్ సినిమాని వదిలేసారు.

అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన “యాత్ర” సినిమా రిలీజ్ డేట్ లో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు ఆ సినిమాకి కరెక్ట్ పోటీ సినిమా కెమెరా మెన్ గంగతో రాంబాబు కరెక్ట్ అని ఓ రేంజ్ లో లేపారు. దీనితో దీనితో చిత్ర నిర్మాణ సంస్థ రీ రిలీజ్ కి గాను అనుకున్నట్టే పోటీకి తీసుకొచ్చారు.

కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ సినిమాకి డిజాస్టర్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. దీనితో అప్పుడు అన్ని ఫీట్లు వేసిన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు సినిమాకి టికెట్స్ బుక్ చేసుకోడం మానేశారు. దీనితో మళ్ళీ ఫైనల్ గా పవన్ ని వారు వదిలేసినట్టే అని చెప్పి తీరాలి. ఈ ఫిబ్రవరి 7న అయితే సినిమా రాబోతుంది. అప్పటికెలా ఉంటుందో చూడాలి.