క్రేజీ న్యూస్ : అఖిల్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎలాగంటే.. 

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న యంగ్ హీరోస్ లో అక్కినేని వారి నుంచి పరిచయం అయ్యిన యంగ్ హీరో అఖిల్ అక్కినేని కి స్పెషల్ ప్లేస్ ఉందని చెప్పాలి. తాను పరిచయం అయ్యిన నాటి నుంచి కూడా తన సినిమాలు సరిగ్గా రాణించకపోయినప్పటికీ తన సినిమాలకి ఇప్పటికీ సూపర్ మార్కెట్ ఉంది.

ఇలా ఓ యంగ్ హీరోకి ఉండడం తనకే చెల్లింది అని చెప్పడంలో డౌట్ లేదు. కాగా లాస్ట్ సినిమా “ఏజెంట్” భారీ ప్లాప్ అయినప్పటికీ తన నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా రీసెంట్ గా అఖిల్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అండ్ టీం తో కనిపించడం అనేది వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

అయితే తాను సలార్ 2 లో ఉన్నాడు అని కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ దానిని ప్రశాంత్ నీల్ భార్య కొట్టి పారేసింది. కానీ ఇక్కడ క్రేజీ న్యూస్ ఏమిటంటే నీల్ కాంపౌండ్ తో అయితే అఖిల్ వర్క్ చేస్తున్నాడట. అదెలా అంటే ప్రశాంత్ నీల్ మరియు నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ తో కలిసి అఖిల్ సినిమాని నిర్మాణం వహిస్తున్నారట.

కొత్త దర్శకుడుతో ఓ భారీ భారీ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ని తాము ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా పట్ల ఆడియెన్స్ లో ఓ రేంజ్ ఆసక్తి స్టార్ట్ అయ్యింది. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యి ముగుస్తుందో అనేది.