స్నేహ ఫోటోకి బన్నీ ట్యాగ్ లైన్

ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయటానికి ట్రై చేసే సెలెబ్రిటీలలో అల్లు అర్జున్ కూడా ఉంటాడు. తన భార్య, పిల్లల గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. వారికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు.

రీసెంట్ గా బన్నీ తన వైఫ్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు.
“ఓ మై గాడ్ నేను ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని నమ్మలేక పోతున్నాను”. అని తన భార్య అందాన్ని పొగిడాడు.

టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు అల్లు అర్జున్-స్నేహారెడ్డి. ఈ ప్రేమజంట 2011 లో పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు అయాన్, కూతురు అర్హ.