పరాజయం , విషాదం పంచిన పసిడి నవ్వులు

జీవితంలో పరాజయం కలిగినప్పుడు మానసికకంగా  బాగా దెబ్బ తింటారు , కృంగిపోతారు . దీనిని  స్వయంగా అనుభవించిన వాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ . పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మించిన “అజ్ఞాత వాసి ” సినిమా ఊహించని పరాజయం పాలయ్యింది . ఈ దెబ్బ  అటు పవన్ కళ్యాణ్ కు ఎంత తగిలిందో  ఇటు డైరెక్టర్ త్రివిక్రమ్ కు అంతే గాయం చేసింది .

ఇక జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ మరణం ఆయన్ని బాగా దెబ్బతీసింది . ఊహించాని ఘటన ఇది . తండ్రి అంటే ఎంతో అభిమానం ఎన్టీఆర్ కు. తనను కేవలం తండ్రి మాత్రమే కాదు , గురువు, మార్గదర్శి , దైవం అన్నీ హరి కృష్ణే . అలాంటి తండ్రిని కోల్పోయిన భాధను దిగమింగుకొని కొని మరీ “అరవింద సమేత వీరరాఘవ ” చిత్రం షూటింగ్లో పాల్గొన్నాడు ఎన్టీఆర్ . తన వ్యక్తిగత భాదను మర్చిపోయి నిర్మాత క్షేమం కోసం ఆలోచించాడు . ఎన్టీఆర్ నమ్మకం అరవింద సమేత నిలబెట్టింది . కాసుల వర్షం కురిపిస్తుంది .

“అరవింద సమేత  వీర రాఘవ “సినిమా తమ కుటుంబంలో నవ్వులను పూయించిందని  స్వయంగా ఎన్టీఆర్ చెప్పాడు . ఈ చిత్రం ఈ నెల 11 న విడుదలైంది . 14వ  తేదీకే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లనువసూలు  చేసింది . ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఎన్టీఆర్ తన తల్లి  శాలిని  ముఖంలో నవ్వు చూశానని ఎంతో సంతృప్తిగా చెప్పాడు .

అలాగే “అరవింద సమేత  వీర రాఘవ ” చిత్రం అన్ని బాధల్ని  మరిపించిందని, ఓ మంచి సినిమా తీశామని తృప్తి కలిగిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపాడు . అరవింద సమేత వీరరాఘవ సినిమా త్రివిక్రమ్ ఫ్లాప్ భాధను మర్చిపోయేలా చేసింది . ఎన్టీఆర్ ను విషాదం నుంచి ఆనందంలోకి  మార్చేసింది.