వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో కల కలం రేపుతుంటారు. అయితే ఇటీవలె ఆయన దర్శకత్వం వహించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. సెన్సార్ వాళ్లు వర్మకు చుక్కలు చూపించారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ప్రముఖ సెలబ్రెటీల మీద సినిమాలు తీస్తూ నిత్యం వివాదాలతో కాపురం చేస్తున్నారు రామ్‌గోపాల్‌వర్మ. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఆర్జీవీ రచయిత, కవి జొన్నవిత్తుల బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక అందరి పైన సినిమాలను తీసే ఈయనకి ఈయన బయెపిక్‌నే తీయడానికి సాహసించారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా, అందరి మీద సినిమాలు తీసే ఆర్జీవీకి సినిమాతోనే చెక్ చెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆర్జీవీ క్యారెక్టర్ పోషించే నటుడిని కూడా పట్టేసారు.
దాదాపు ఆర్జీవీ మాదిరిగానే వుండే వ్యక్తి ఒకరు మధ్యప్రదేశ్ లో వున్నట్లు తెలిసి, అతన్ని కలిసి, సినిమాకు ఒప్పించినట్లు సమాచారం. అన్ని భాషల్లో ఈ సినిమాని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్జీవీ మీద పీకల లోతు కోపం, కసి వున్న పలువురు, తమ వంతు సాయం చేస్తామని ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్జీవీ వ్యవహారాలు మొత్తం ఎండ గట్టేలా స్క్రిప్ట్ తయారు అవుతుందట.