Sumathi Shatakam: విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ & టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ చిత్రం నుండి ‘ఎక్కడే ఎక్కడే’ పాటను మేకర్స్ విడుదల చేశారు. తిరుపతి జావన రాసిన ఈ పాటకు ధనుంజయ్ సీపన తన స్వరాన్ని జోడించి అద్భుతంగా పాడారు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ద్వారా ఆదిత్య మ్యూజిక్ లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.
ఇక ఈ పాట విషయానికి వస్తే ఎక్కడే ఎక్కడే అంటూ మొదలైన ఈ పాట మంచి మెలోడి రూపంలో లవ్ సాంగ్ అని అర్థం అవుతుంది. ఎంతో అర్థమంతమైన లిరిక్స్ ఉన్న ఈ పాట త్వరలోనే మంచి చార్ట్బస్టర్ గా చిత్రానికి ప్లస్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది.
నటీనటులు : అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు.
సాంకేతిక నిపుణులు :
రచన, దర్శకత్వం : ఎంఎం నాయుడు
నిర్మాత : సాయి సుధాకర్ కొమ్మాలపాటి
బ్యానర్ : విజన్ మూవీ మేకర్స్
సమర్పణ : కొమ్మలపాటి శ్రీధర్
సినిమాటోగ్రాఫర్ : ఎస్ హలేష్
ఎడిటర్ : నహిద్ మహమ్మద్
సంగీతం : సుభాష్ ఆనంద్
డైలాగ్స్ : బండారు నాయుడు
పిఆర్ఓ : మధు విఆర్


