Nenu Ready: యంగ్ హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కినతో కలసి కంప్లీట్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’ చేస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్‌ను ఇంతకు ముందు ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రంతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు.
ఈ టీజర్ ఒక ఎంటర్టైనింగ్ కథాంశాన్ని పరిచయం చేస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాధ్యత గల మధ్యతరగతి ఆంధ్ర యువకుడికి, ఒక మధ్యతరగతి తెలంగాణ అమ్మాయితో నిశ్చితార్థం జరగడం, దానివల్ల కల్చర్, లైఫ్ స్టయిల్ మధ్య హిలేరియస్ కాన్ఫ్లిక్ట్ కి దారితీయడం ఆసక్తికరంగా వుంది.
త్రినాధ రావు నక్కిన మరోసారి కంప్లీట్ ఎంటర్టైనర్ రూపొందించడంలో తన మార్క్ ని చూపించారు. అమ్మాయి కుటుంబం మాంసాహారాన్ని అమితంగా ఇష్టపడటం, అబ్బాయి కుటుంబం శాకాహారాన్ని పాటించడం వంటి సహజమైన పరిస్థితుల ద్వారా హాస్యాన్ని పండించారు.
హవిష్ బాధ్యత గల మధ్యతరగతి కుర్రాడి పాత్రలో ఒదిగిపోయి, తన స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. కావ్య థాపర్ నిజాం అమ్మాయిగా ఆకట్టుకుంది. వారిద్దరి కెమిస్ట్రీ ఎట్రాక్టివ్ గా వుంది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, VTV గణేష్ వంటి హాస్య నటులు ఉండటంతో, ఈ చిత్రం నాన్‌స్టాప్ వినోదాన్ని అందిస్తుందని ప్రామిస్ చేస్తుంది.

నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ విజువల్స్ తో ఆకట్టుకుంటుంది, మిక్కీ జె మేయర్ తన ఉత్సాహభరితమైన నేపథ్య సంగీతంతో హ్యుమర్ ని మరింత పెంచారు. హర్నిక్స్ ఇండియా LLP నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ఈ టీజర్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 2026 వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.
నటీనటులు: హవీష్, కావ్య థాపర్, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాత: నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
DOP: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్

