Mardaani 3: ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మర్దానీ 3’ ట్రైలర్ విడుదలైంది. హిందీ చిత్ర పరిశ్రమలోని ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో ‘మర్దానీ 3’ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా అందరినీ మెప్పిస్తోంది. దశాబ్దానికి పైగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణతో పాటు, విమర్శకులు ప్రశంసలను కూడా సినిమా అందుకుంటోంది. మన దేశంలో మహిళా పోలీస్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఫిల్మ్ యూనివర్స్‌గా, సినీ ప్రేమకుల హృదయాల్లో కల్ట్ మూవీగా మర్దానీ ఫ్రాంచైజీ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ‘మర్దానీ 3’లో వృత్తిలోరాజీ పడకుండా ధైర్య సాహసాలను ప్రదర్శించే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణీ ముఖర్జీ కనిపించనున్నారు. దేశంలో అదృశ్యమైపోతున్న అనేక మంది బాలికలను కాపాడేందుకు ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. ఈ మర్దానీ 3లో రాణీ ముఖర్జీ పాత్రను ఎదిరించే క్రూరమైన విలన్ రోల్‌లో ప్రముఖ నటి మల్లికా ప్రసాద్ నటించారు. న్యాయం కోసం చేసే ఈ పోరాటం మరింత హిసాత్మకంగా ఉండనుంది. మర్దానీ 3లో సైతాన్ ఫేమ్ జానకి బొడివాలా కీలక పాత్రలో నటించటం ద్వారా మర్దానీ ఫ్రాంచైజీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి ది రైల్వే మెన్ ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆయుష్ గుప్తా కథ, స్క్రీన్‌ప్లే అందించారు.
మర్దానీ 3 నుంచి రాణీ ముఖర్జీ పోస్టర్ విడుదలైనప్పుడు దానికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు రిలీజైన ట్రైలర్‌తో అంచనాలు మరింతగా పెరిగాయి.
మర్దానీ 3 చిత్రానికి అభిరాజ్ మినవాలా దర్శకత్వం వహిస్తున్నారు. మన సమాజంలో ఉన్న ఇబ్బందికరమైన అంశాలను ప్రశ్నించేలా మర్దానీ ఫ్రాంచైజీని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే మూడో భాగాన్ని మన ముందకు తీసుకు రాబోతున్నారు.
మర్దానీ మొదటి భాగంలో హ్యుమన్ ట్రాఫికింగ్ అంశాన్ని స్పృశించగా.. మర్దానీ 2లో సీరియల్ రేపిస్టు వికృత మానసికతను చూపించారు. ఇప్పుడు మర్దానీ 3 మన సమాజంలోని మరో చీకటి కోణాన్ని, క్రూరమైన వాస్తవాన్ని తెరపైకి తీసుకొస్తోంది.
‘మర్దానీ 3’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జనవరి 30న విడుదల చేస్తున్నారు.


