RGV: ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చని గతంలో పెద్ద ఎత్తున పోలీసులు ఈయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వారి గురించి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేసిన వారిని అరెస్టులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ రాంగోపాల్ వర్మ చేసిన పోస్ట్ పై కూడా కేసులు నమోదు కావడంతో ఈయన అరెస్టు కావచ్చని అందరూ భావించారు.
ఇక ఈ కేసు విషయంలో కూడా రాంగోపాల్ వర్మ గట్టిగా పోరాటం చేయడమే కాకుండా కోర్టు నుంచి విముక్తిని కూడా పొందారు. అయితే తాజాగా ఈయనకు కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా మూడు నెలల జైలశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఈయనకు మూడు నెలల జైలు శిక్ష ఎందుకు ఏంటి అనే విషయానికి వస్తే…
2018 సంవత్సరంలో చెక్ బౌన్స్ కేసులో భాగంగా ఈయనపై కేసు నమోదు అయింది. 2018లో మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో చెక్కు బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత ఏడు సంవత్సరాలుగా విచారణ కొనసాగుతూనే ఉంది.ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వర్మ కోర్టుకు గైర్హాజరయ్యాడు. దీంతో అతనిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను కోర్టు దోషిగా నిర్ధారించింది.
వచ్చే మూడు నెలల్గోగా ఫిర్యాదుదారుడికి రామ్‌గోపాల్ వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో మూడు నెలలపాటు ఆయన సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అంటూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇలా కోర్టు తీర్పుతో రాంగోపాల్ వర్మ కు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి అయితే ఈయన జైలుకు వెళ్తారా లేకపోతే కోర్టు చెప్పిన విధంగా పరిహారం చెల్లిస్తారా అనేది తెలియాల్సి ఉంది.