RGV: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఈ సినిమా ద్వారా నిర్మాతకు సుమారు 200 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు కూడా తెలుస్తుంది.
ఎన్నో అంచనాల నడుమ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఆకట్టుకోలేకపోవడానికి గల కారణాలను ఎంతోమంది విశ్లేషిస్తూ తెలియజేశారు అయితే తాజాగా ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు అంతేకాకుండా ఈ సినిమా ఎందుకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అనే విషయాలను కూడా రామ్ గోపాల్ వర్మ తెలియజేశారు.
ఒకప్పుడు దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇటీవల కాలంలో చేస్తున్న సినిమాల ద్వారా భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల చేసిన సినిమాలను చూసి ఆయనే ఇలాంటి సినిమాలు చేస్తున్నానా అంటూ ఎమోషనల్ అయ్యారు అందుకే ఇకపై పాత వర్మగా సరికొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో ఏదో ఒక బలమైన పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ ఆధారంగానే సినిమా కథ మొత్తం నడుస్తుందని తెలిపారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో ఒకే ఒక్కడులో ఒకరోజు సీఎం అయితే ఎలా ఉంటుందో అనే పాయింట్ పైనే కథ మొత్తం తిరిగి సినిమా సక్సెస్ అయింది.
ఇక రోబో సినిమాలో మెయిన్ పాయింట్ రోబో. ఆ రోబోలో ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందో అనే అంశంపై సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే ఆయన ఆ బలమైన పాయింట్ మిస్ చేశారని అందుకే ఈ సినిమా కథ ఏంటి అనే క్లారిటీ లేకుండా పోయిందని తెలిపారు. శంకర్ బలమైన సీడ్ వేయలేదు. బలమైన పునాది లేకపోతే ఏదైనా ఎప్పుడు కూలుతుందో అర్థం కాదు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందని వర్మ తెలియజేశారు.