హ్యాపీ మూడ్‌లో కాజల్

అందాల ‘చందమామ’ కాజల్ పిచ్చి హ్యాపీ మూడ్‌లో ఉందట. అందుక్కారణం… సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహం కొలువుకానుంది. అంటే .. కాజల్ తనను తాను నిలువెత్తు పోజులో చూసుకోడానికి ఆరాటపడుతోందన్న మాట. ఫిబ్రవరి 5న టుస్సాడ్స్‌లో కాజల్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అదీ కాజల్ ఆనందానికి అసలు కారణం.

ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్‌బాబుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్‌లో చోటుచేసుకున్నాయి. బాలీవుడ్ నుంచి అమితాబ్, హృతిక్, కాజోల్, కరీనావంటి ప్రముఖుల మైనపు విగ్రహాలూ అక్కడ దర్శనమిస్తున్నాయి. ఆ విగ్రహాల మధ్యకు తన మైనపు బొమ్మ చేరుతుందన్న సంతోషం కాజల్‌ను నిలవనివ్వటం లేదట.

ప్రస్తుతం కాజల్.. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న మోసగాళ్లు చిత్రంలో చేస్తోంది. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న భారతీయుడు -2 ప్రాజెక్టులో కమల్‌తో కాజల్ నటిస్తుండటం తెలిసిందే. హ్యాపీ మూడ్‌లో కాజల్ జోరు సాగుతుందన్నమాట!?