పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇలా అందరికీ ఈ సినిమాతో ఒక్కసారిగా దశ తిరిగిపోయింది. ఈ సినిమా హీరో పుష్ప గా అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ వచ్చిందో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక కి కూడా అంతే పేరు వచ్చింది.
ఈ సినిమాతో నేషనల్ క్రష్ గా కూడా మారిపోయింది రష్మిక. అంతేకాదు ఈ సినిమా హిట్ అవటంతో ఆమెకి బాలీవుడ్ రెడ్ కార్పొరేట్ వేసి మరీ ఆహ్వానించింది. అక్కడ యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటించి అక్కడ కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని అక్కడ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది రష్మిక. అయితే పుష్ప సినిమాకి శ్రీవల్లి పాత్రలో మొదట రష్మిక ని అనుకోలేదంట డైరెక్టర్ సుకుమార్.
ముందుగా సమంతా ని ఈ పాత్ర కోసం అనుకున్నారంట అయితే అంతకుముందే రంగస్థలంలో అలాంటి పాత్ర పోషించిన సమంత మళ్లీ అలాంటి పాత్ర పోషించడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ కోసం కీర్తి సురేష్ ని సంప్రదించగా ఆమెకి కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉండటంతో ఈ పాత్ర నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇంకా ఈ పాత్ర కోసం అనుష్క, త్రిష, పూజ హెగ్డే, కాజల్ ని సంప్రదించారట మూవీ టీం.కారణాలు తెలియదు కానీ వాళ్ళు ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు.
ఆఖరికి అల్లు అర్జున్ ని స్టేజిపై అవమానించిన నయనతారని కూడా ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రకి సంప్రదిస్తే ఆమె కూడా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆఖరున అదృష్టం అందలం ఎక్కడంతో ఈ పాత్ర రష్మిక దక్కించుకుంది. అంతే మరి దేనికైనా అదృష్టం ఉండాలి కదా, ఆ మాటకొస్తే ఈ సినిమాలో హీరో అయినా పుష్పరాజ్ పాత్ర కోసం సుకుమార్ మొదట మహేష్ బాబుని సంప్రదించాడంట కానీ ఆ పాత్రతనికి సూట్ అవ్వదు అని మహేష్ బాబు రిసర్వ్ చేసినట్లు సమాచారం.