ఓటిటిలో మరో సర్ప్రైజ్ తో “భగవంత్ కేసరి” బ్లాస్ట్.. 

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి. మరి రెండు భారీ హిట్ లు అనంతరం బాలయ్య నుంచి వచ్చిన సినిమా ఇది కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. ఆ ఎదురు చూపులకి దర్శకుడు అనీల్ రావిపూడి సెన్సేషనల్ హిట్ ని అందించి బాలయ్య కెరీర్ లో హ్యాట్రిక్ విజయాలకు దోహదం అయ్యాడు.

మరి ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఇప్పుడు ఓటిటి సందడి చేసేందుకు వచ్చాడు. మరి నిన్ననే సర్ప్రైజింగ్ గా డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా అనుకున్నట్టే ఈరోజు నుంచే భగవంత్ కేసరి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది.

అయితే ఈ చిత్రం మొదట ఒక్క తెలుగు లోనే వస్తుంది అని చాలా మంది అనుకుంటే ఇది సర్ప్రైజింగ్ గా తెలుగు సహా సౌత్ ఇండియా భాషలు అన్నీ ఏవ్ కాకుండా హిందీలో కూడా ఇపుడు స్ట్రీమింగ్ కి ఏకకాలంలో రావడం ఆసక్తిగా మారింది. దీనితో బాలయ్య అఖండ తర్వాత మరోసారి ఓటిటిలో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసాడు అని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల బాలయ్య కూతురుగా కనిపించింది. అలాగే షైన్ స్క్రీన్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. మరి ఈ సినిమాకి పాన్ ఇండియా ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.