బీచ్‌లో బికినీ బ్యూటీస్‌.. కాజల్-నిషా అగర్వాల్ వెకేషన్ హంగామా..!

టాలీవుడ్‌లో గ్లామర్‌తోనే కాదు, తన ఎలాంటి పాత్రకైనా సమర్థ నటనతోనూ అభిమానులను గెలిచుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన ఫ్యామిలీతో బీచ్ వెకేషన్‌లో మస్తీ చేస్తూ సోషల్ మీడియాలో మరింత సెన్సేషన్‌గా మారింది. కాజల్‌కు వెకేషన్ అంటే చెల్లెలు నిషా అగర్వాల్ ఉండక తప్పదు. ఈ సారి కూడా అక్కా-చెల్లెళ్లు కలసి బీచ్ ఒడ్డున తెగ సందడి చేశారు.

తెలుగు ప్రేక్షకులకు ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో పరిచయమైన కాజల్ అగర్వాల్, ఆ తర్వాత కెరీర్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. మహేష్‌బాబుతో ‘బిజినెస్‌మేన్’, రామ్‌చరణ్‌తో ‘మగధీర’, ‘నాయక్’, ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్‌ షేర్ చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలను వదలని కాజల్‌కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ‘‘భగవంత్ కేసరి’’లో బాలయ్యతో చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ‘‘కన్నప్ప’’లో పార్వతీ దేవిగా మరోవైపు మరో వైపు కొత్తగా మెరిసింది.

కాజల్ ప్రస్తుతం రెండు పెద్ద ప్రాజెక్టుల కోసం షూటింగ్స్‌లో బిజీగా ఉంటూ కూడా ఫ్యామిలీకి టైమ్ కేటాయించడం మర్చిపోదు. తన చెల్లెలు నిషా అగర్వాల్‌తో పాటు ఎప్పుడూ ఎక్కడికైనా వెకేషన్‌కి వెళ్లడం కాజల్‌కి అలవాటు. నిషా కూడా ఒకప్పుడు టాలీవుడ్‌లో ‘‘సోలో’’, ‘‘ఈ మాయలో సూర్య’’లాంటి సినిమాలతో ఆకట్టుకున్నప్పటికీ, నటనకు గుడ్‌ బై చెప్పి ఫ్యామిలీ లైఫ్ ఎంచుకుంది.

తాజాగా ఈ అక్కా-చెల్లెళ్లు బీచ్‌కి వెళ్లి బికినీ అందాలతో సోషల్ మీడియాలో కలకలం సృష్టించారు. నిషా బ్లాక్ బికినీ, కాజల్ వైట్ బికినీ ధరించి బీచ్‌ లో రొమాంటిక్‌గా, క్యూట్‌గా ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఆ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ‘సూపర్ హాట్ అండ్ క్యూట్ సిస్టర్స్’, ‘ఓ మై గాడ్.. కాజల్ లుక్‌కి ఏం తక్కువైందీ?’, ‘నిషా కూడా ఇంకా అదే గ్లామర్‌తో కనిపిస్తుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌తో ఫోటోలను షేర్ చేస్తున్నారు.

తాజాగా కాజల్ ఒక ఇంటర్వ్యూలో ‘‘ఎప్పుడు పని చేస్తూ ఉంటే కూడా ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకే పని, ఫ్యామిలీ రెండింటికీ సమం గా టైమ్ కేటాయిస్తాను. నిషా లాంటి చెల్లి ఉండటం నాకు గుడ్ బూస్ట్’’ అంటూ చెప్పింది. ప్రస్తుతం కాజల్ ‘‘ఇండియన్ 2’’ సినిమాలో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. మరోవైపు వెబ్ సిరీస్ అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.

ఇక ఈ అక్కాచెల్లెళ్ల బీచ్ మజా ఫొటోలు చూసి కాజల్, నిషా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. ‘‘ఇప్పటికీ కాజల్ అందానికి తగ్గబోడు’’ అంటూ కుర్రకారు కామెంట్స్‌తో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఈ బీచ్ వెకేషన్ హంగామా అభిమానులను ఫిదా చేస్తోంది.