“ఇండియన్ 2” కోసం ఓ మాసివ్ సీక్వెన్స్ లో శంకర్..!

ప్రెజెంట్ సౌత్ ఇండియా సినిమా నుంచి రాబోతున్న కొన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మాస్ చిత్రాల్లో అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చెంజర్ అలాగే ఉలగనయగన్ కమల్ హాసన్ తో చేస్తున్న మాసివ్ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2” సినిమాలు కూడా ఉన్నాయి.

అయితే వీటిలో ఇంకా ఏది షూటింగ్ కంప్లీట్ కాలేదు కానీ ఇండియన్ 2 షూటింగ్ మాత్రం ఆల్ మోస్ట్ ముగింపు దశకి వచ్చేసింది. కాగా ఈ భారీ సినిమా నుంచి మొన్ననే ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు కానీ అనుకున్న రేంజ్ లో ఇది హిట్ కాలేదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో అయితే హాట్ టాపిక్ గా మారింది.

ప్రెజెంట్ శంకర్ అండ్ టీం విజయవాడలోనే ఉన్నారట. కాగా అక్కడ చిత్ర యూనిట్ కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ కోసం శంకర్ ఏకంగా ఎనిమిది వేలకి మంది పైగా ఆర్టిస్టులతో ప్లాన్ చేసాడని తెలుస్తుంది. దీని ఆ ప్రాంతం అంతా ఒక నాలుగు రోజులు పాటుగా పోలీసుల అబ్జర్వేషన్ లోనే షూటింగ్ కొనసాగుతుంది.

ఈ నాలుగు రోజుల్లో శంకర్ కీలకమైన గ్రాండ్ సీక్వెన్స్ ని అక్కడ చేస్తున్నారని అంటున్నారు. దీనితో ఈ ఊహించని న్యూస్ సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చగా మారింది. ఇక ఈ సినిమాలో కాజల్, రకుల్ సహా సిద్ధార్థ్ తదితరులు నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.