Spirit: రెబెల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్

Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ లో తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ న్యూ ఇయర్ కి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రభాస్‌ను రా, ఫిల్టర్ చేయని అవతార్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

మేకర్స్ ఇప్పుడు థియేటర్ రిలీజ్ డేట్ నిఖరారు చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ రేస్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ స్పిరిట్ మార్చి 5, 2027న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సందీప్ వంగా మార్క్ ఇన్‌టెన్స్, యాక్షన్, ఎమోషన్స్, రా పవర్ తో ఈ యాక్షనర్‌ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో వుంది.

స్పిరిట్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ మొత్తం 8 భాషల్లో యూనివర్సల్ గా రిలీజ్ కానుంది.

Dasari Vignan About Slum Dog 33 Temple Road Movie || Vijay Sethupathi || Puri Jagannadh || TR