Ram Bhajarang: గ్రాండ్ గా ‘రామ్ భజరంగ్’ గ్లిమ్స్ విడుదల కార్యక్రమం !!!

Ram Bhajarang: సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రవి ఆర్ట్స్ బయ్యర్ల పై నిర్మాతలు స్వాతిసుధీర్, డాక్టర్ రవి బాల నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ‘రామ్ భజరంగ్’ సినిమాకు సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, కమల్, షఫీ, శివరామరాజు వెంకట్, ధనరాజ్, రచ్చ రవి, రాకేశ్, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయని, 2026లో ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఈ చిత్ర గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది, ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కెమెరామేన్ అజయన్ విన్‌సెంట్ మాట్లాడుతూ… రామ్ భజరంగ్ సినిమా చాలా బాగుంటుంది, షూటింగ్ చేసే సమయంలోనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, త్వరలో ఈ మూవీ థియేటర్స్ లో రానుందని తెలిపారు.

వెంకట్ మాట్లాడుతూ… ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో నటించాను, నెగిటీవ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర మీ అందరికి నచ్చుతుంది, డైరెక్టర్ సుధీర్ రాజ్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు, చాలా వైడ్ అండ్ వైలెంట్ రోల్ నాకు డైరెక్టర్ గారు ఇచ్చారు ఈ మూవీలో, నా లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, నిర్మాతలు స్వాతి సుధీర్ అలాగే రవి బాల గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

హీరొయిన్ మానస రాధాకృష్ణ మాట్లాడుతూ… ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను, ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది, నాకు ఈ రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ సుధీర్ గారికి ధన్యవాదాలు, సందీప్ మాధవ్, రాజ్ తరుణ్ తో నటించడం మర్చిపోలేనిదని అన్నారు.

హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ… రామ్ భజరంగ్ సినిమా గ్లిమ్స్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, ఎక్కడా రాజీ పడకుండా డైరెక్టర్ సుధర్ రాజు గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు, నిర్మాత స్వాతి గారు సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు, ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ… ఈ సినిమా కోసం నేను చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాను, నా లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది, గ్లిమ్స్ చాలా బాగుందని అందరూ అంటున్నారు, డైరెక్టర్ సుధీర్ గారు రాసుకున్న స్క్రిప్ట్ చలా బాగుంది, త్వరలో రాబోతున్న రామ్ భజరంగ్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్ సుధీర్ రాజు మాట్లాడుతూ… ఒక మంచి మాస్ సినిమా చెయ్యాలని ఈ రామ్ భజరంగ్ సినిమా కథ రాసుకున్నాను, మణిశర్మ గారి సంగీతం, అజయన్ విన్‌సెంట్ గారి కెమెరా వర్క్ ఈ సినిమాకు హైలెట్. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ ఇద్దరూ హీరోలు పోటీ పడి నటించారు, త్వరలో మా సినిమా టీజర్ ట్రైలర్ విడుదల కాబోతున్నాయి అన్నారు.

నిర్మాత స్వాతి సుధీర్ మాట్లాడుతూ… రాజ్ తరుణ్ చేస్తున్న 25వ సినిమా రామ్ భజరంగ్. అతనితో మరిన్ని సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నాను. సందీప్ మాధవ్ కు ఈ సినిమా మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది, అందరూ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ రామ్ భజరంగ్ సినిమా కోసం బాగా కష్టపడి వర్క్ చేశారు, మా సినిమాకు అందరి సపోర్ట్ కావాలని అన్నారు.

నిర్మాత రవి బాల మాట్లాడుతూ… ఈ సినిమాతో రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తారు, డైరెక్టర్ సుధర్ రాజ్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు, వెంకట్ గారి పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటారు, సిమ్రత్ కౌర్, సాత్నా టైటస్, మానస రాధాకృష్ణ అందరూ బాగా చేశారు, కేరళ లో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఈ సినిమాను షూట్ చేశాము, స్టోరీ, స్క్రీన్ ప్లే, విజువల్స్ అన్ని ఈ సినిమాకు చాలా బాగా కుదిరాయి, మీ అందరి బ్లెస్సింగ్స్ తో మా రామ్ భజరంగ్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Dasari Vignan About Slum Dog 33 Temple Road Movie || Vijay Sethupathi || Puri Jagannadh || TR