Slum Dog 33 Temple Road: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పవర్ హౌస్ పెర్ఫార్మర్ విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా వెంచర్ #పూరిసేతుపతి ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది, షూటింగ్ భాగం ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు.
విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘స్లమ్ డాగ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో, 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సేతుపతి వైల్డ్ అవతార్ లో , ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. పొగమంచుతో కప్పబడిన మురికివాడలో గజిబిజిగా ఎగురుతున్న డబ్బు కుప్పల మధ్య, పెద్ద కొడవలిని పట్టుకుని కనిపించడం అదిరిపోయింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి టైటిల్, ఫస్ట్ లుక్ భారీ హైప్ ని క్రియేట్ చేశాయి.
పూరి జగన్నాధ్ తన హీరోలను అద్భుతంగా మేకోవర్ లతో ప్రెజెంట్ చేయడంలో పాపులర్. స్లమ్ డాగ్ లో విజయ్ సేతుపతిని ఇంతకు ముందు ఎన్నడూ చూడని అవతార్ లో చూపించబోతున్నారు. తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ లు హ్యుమరస్ పాత్రల్లో నటిస్తున్నారు.

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలలో అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్, ‘స్లమ్ డాగ్’ 33 టెంపుల్ రోడ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం ఐదు భాషలలో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ) గ్రాండ్ పాన్-ఇండియా రిలీజ్ కానుంది.
తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, జెబి నారాయణరావు కొండ్రోళ్ల
సమర్పణ: ఛార్మీ కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

