టిఆర్ఎస్ అభ్యర్థిని గెదిమిన పంతంగి పోరగాళ్లు (వీడియోలు)

తెలంగాణలో టిఆర్ఎస్ అభ్యర్థులకు జనాల నుంచి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో సాదర స్వాగతాలు లభిస్తున్నప్పటికీ మరికొన్ని గ్రామాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులకు ఊహించిన షాక్ తుగులుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే నియామకాలు ఏవని గ్రామాల్లో నిరుద్యోగ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. లోకల్ సమస్యలపై కూడా జనాలు నిలదీస్తున్నారు.

యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో యూత్ స్థానిక టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి గట్టి ఝలక్ ఇచ్చారు. గ్రామంలో ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంతంగి గ్రామంలో పోరగాళ్లు ఎంతకూ పంతం వీడకపోవడంతో ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల వెనుదిరిగిపోయారు. ఆయనను గ్రామ పొలిమేరల దాకా గ్రామస్తులు వెళ్లగొట్టారు. 

పంతంగి గ్రామంలో యువకులు టిఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా నిరసన తెలపడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. యూత్ ఎలా అడ్డుకుంటున్నారో కింద రెండు వీడియోలు ఉన్నాయి చూడండి.

 

trs kusukuntla prabhakar reddy

 

trs candidate