తెలంగాణలో ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. టిఆర్ఎస్ దూకుడు మీదున్నది. కేసిఆర్ క్షణం తీరిక లేకుండా హెలిక్యాప్టర్ లో తిరుగుతూ గంటకో నియోజకవర్గంలో సభ కు హాజరవుతున్నారు. అదే సమయంలో టిఆర్ఎస్ నేతలకు జనాల నుంచి విపక్షాల నుంచి ఇంకా నిరసన సెగలు తాకుతూనే ఉన్నాయి.
తాజాగా అశ్వరావుపేట టిఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు గట్టి షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలంలో పోకలగూడెం గ్రామంలో ఆయన ప్రచార రథాన్ని స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. లంబాడీలను ఎస్టీల జాబితాలో నుంచి తొలగించాలని తాటి వెంకటేశ్వర్లు ప్రయత్నించారని గ్రామస్తులు ఆరోపించారు. అప్పట్లో తాటి ఈ వివాదం నేపథ్యంలో తాటి వెంకటేశ్వర్లు మీద ప్రచురితమైన పోస్టర్లను వారు ఆయనకు చూపించారు.
ఈ సమయంలో మహిళలు చెప్పులు చూపించి తిట్ల పురాణం అందుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారితో కూడా వాగ్వాదానికి దిగారు. మా గ్రామానికి ఏం చేశావంటూ యువకులు నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని శాంతింపజేశారు.
ఆందోళనకారుల వీడియో కింద ఉంది చూడండి.