తెలంగాణ నూతన మంత్రులకు దక్కే శాఖలివే

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ మరికాసేపట్లో జరగనుంది. మొత్తం పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో ఉదయం 11.30 నిమిషాలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారికి సీఎం కేసీఆర్ అధికారికంగా శాఖలు కేటాయించనున్నారు. అయితే ఎవరికి ఏ శాఖ దక్కుతుందోనన్న చర్చ జరుగుతోంది. అయితే మంత్రులకు కేటాయించాల్సిన శాఖల పై ఇప్పటికే ఓ క్లారిటి వచ్చిందని తెలుస్తోంది.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రులకు ఏ శాఖలు దక్కానున్నాయంటే..

  1. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి- ఆర్థిక శాఖ
  2. ఎర్రబెల్లి దయాకర్ రావు- వ్యవసాయ శాఖ
  3. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి- వైద్య, ఆరోగ్య శాఖ
  4. ఈటల రాజేందర్- సంక్షేమ శాఖ
  5. కొప్పుల ఈశ్వర్- విద్యా శాఖ
  6. వేమలు ప్రశాంత్ రెడ్డి- పరిశ్రమల శాఖ
  7. గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి- రోడ్లు, భవనాలు
  8. సిహెచ్. మల్లారెడ్డి- రవాణా
  9. శ్రీనివాస్ గౌడ్- మున్సిపల్ శాఖ
  10. తలసాని శ్రీనివాస్ యాదవ్- పౌర సరఫరాల శాఖ

ఇప్పటికే హోంమంత్రిగా మహమూద్ అలీ కొనసాగుతున్నారు. నూతన మంత్రులకు ఈ శాఖలతో పాటు మరిన్ని శాఖలు అదనంగా అప్పగించే అవకాశం ఉంది.  తొలిసారిగా ఆరుగురు మంత్రులు కాబోతున్నారు. నలుగురు మాజీ మంత్రులకే  మరోసారి అవకాశం దక్కింది.